బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టంలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు సీఎం రేవంత్(CM Reventh) సర్కారు తొవ్వతోంది.
ఒకవైపు ఫొన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీలో కీలక విషయాలు బయట పెట్టాడు. ఇప్పటికే మాజీ ఓఎస్డీ ప్రభాకర్ పేరు తీసుకొచ్చారు. వీటితోపాటు అడిషనల్ ఎస్పీ భుజంగ్‌రావు, తిరుపతి పేర్లు ప్రస్తావించడంతో ఇప్పటికే అదుపులోకి తీసుకోని విచారించి కొద్ది సేపటి క్రితం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆదిపట్ల(Adhibatla) పీఎస్ పరిధిలో ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాల విషయంలో కల్వకుంట్ల కన్నారావు (Kalvakuntla Kannarao)2ఎకరాల భూ కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేగాకుండా మరో 39 మంది కేసు నమోదు చేశారు.