విశాఖలో నకిలీ ఎస్‌ఐల ఘరానా మోసం

మన Enadu:  పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా వేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్‌ సూచనలతో టాస్క్​ఫోర్స్‌ బృందాలు హైదరాబాద్‌ వెళ్లి హనుమంతు రమేష్ ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి.

వీరిద్దరినీ గురువారం సాయంత్రం టాస్క్​ఫోర్స్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్‌ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Related Posts

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *