ManaEnadu:సోషల్ మీడియాతో ఎంత మంచి జరుగుతుందో.. కొన్నిసార్లు అంతకుమించిన కీడు జరుగుతోంది. అయితే అప్పుడప్పుడు నెట్టింట కొన్ని వీడియోలు, ఫొటోలు మాత్రం ముచ్చట గొలుపుతుంటాయి. కొన్ని చూస్తే మోటివేషన్ వస్తే.. మరికొన్ని చూస్తే క్యూట్ అనిపిస్తాయి. ఇంకొన్ని చూస్తే ముచ్చట గొలుపుతాయి. అలాంటి ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. అదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుమార్తె ఆద్య ఫొటో.
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏపీలో కూడా వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఆద్య కూడా పాల్గొంది. ఈ క్రమంలో పవన్ తో కలిసి ఆద్యో ఓ సెల్ఫీ దిగింది. ఈ లవ్లీ మూమెంట్ ను అక్కడున్న కెమెరా మెన్ క్లిక్ మనిపించారు. ఆ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సెల్ఫీని పోస్టు చేస్తూ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నెట్టింట పోస్టు పెట్టారు.
ఇవాళ ఆద్య నన్ను.. తన నాన్నతో పాటు స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లనా అని అడిగింది. తండ్రితో టైం స్పెండ్ చేయాలని తను అనుకుంది. అలాగే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో ఆద్య దగ్గరుండి చూడాలని అనుకుంది. ఆద్య అలా అనుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏపీ ప్రజల కోసం తన నాన్న చేస్తున్న సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయణ్ను ప్రశంసించింది. అని రేణూ దేశాయ్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టును నెటిజన్లు లైక్ చేస్తున్నారు.






