Mana Enadu : ఆకలి.. ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి జీవికి భాష రాకపోయినా.. బంధం అర్థం కాకపోయినా.. బాధ మాత్రం తెలుసు. అదే ఆకలి.. ఆకలి. ప్రతి జీవి ఆకలి ఆపుకోలేక ఆరాటం.. తీర్చటానికై పోరాటం. అందు కోసమే ఏపీ ప్రభుత్వం(AP GOVT)ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఆకలి తీర్చడానికి గత పథకాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ తీసుకురానుంది. ఇందుకు పంద్రాగస్టు సాక్ష్యంగా నిలవనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ఆగస్టు 15న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. పేద వారికి రూ.5కే భోజనం, టిఫిన్ పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్ల(Anna Canteens)ను ఆయా నియోజవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగస్టు 16న ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 5 నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
స్టార్ హోటల్ తరహాలో..
అన్న క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా 5 రూపాయలే. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10 గంటలకు ఉంటుంది. లంచ్ మ.12.30 నుంచి 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. డిన్నర్ రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు అందజేస్తారు. ఆదివారం సెలవు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ పెడతారు. భోజనంలో కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు వడిస్తారు. వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ ఉంటుంది.
స్థానిక సంస్థల MLC ఎన్నికల కారణంగా..
విశాఖపట్నం(Vizag)జిల్లాలో MLC ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్(Election code) అమల్లో ఉండడంతో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. విజయవాడ సిటీలో అత్యధికంగా 11 అన్న క్యాంటీన్లు పెడుతున్నారు. నెల్లూరు 7, గుంటూరు 7, కాకినాడ 5, ఏలూరు 4, రాజమండ్రిలో 3 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, అన్న క్యాంటీన్ల నిర్వహణకు భారీగా విరాళాలు అందుతున్నాయి.






