Mana Enadu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ నగరం భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అయింది. అటు తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భారీ విపత్తునే చవిచూవాయి. అయితే భారీ వరదల క్రమంలో ఏపీలో సెప్టెంబర్ 1న ప్రకాశం బ్యారేజీని(Prakasam Barrage gate) నాలుగు బోట్లు(Boats swept away) ఢీకొట్టాయి. దీంతో పలు గేట్లు(Gates) స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు(Irrigation officials) పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర పడవులు బ్యారేజీని ఢీకొట్టడం వెనుకు కుట్రకోణం ఉందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఇగిరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ వన్‌టౌన్ పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు.నాలుగు బోట్లు ఢీకొట్టిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమానం ఇదే..
కాగా ఈ ప్రమాదంలో బ్యారేజీ(Prakasam Barrage)లోని రెండు గేట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అయితే ఒకేసారి ఇలా పడవలు ఎందుకు వచ్చాయి..? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా..? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారించనున్నారు. చాలా వేగంతో బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్నట్టిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) వద్ద దెబ్బతిన్న(damaged) గేట్లకు మరమ్మతులు చేపట్టారు. బ్యారేజ్ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతింది. జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారు కన్నయ్య నాయుడు(irrigation engineering expert Kannayya Naidu) పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. సుమారు 17 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్లను క్రేన్లతో బయటకు తీశారు. ఆ తర్వాత 67, 68 , 68 గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. గేట్లకు అడ్డుగా ఉన్న 3 భారీ పడవల తొలగింపునకు చర్యలు చేపట్టారు. బ్యారేజ్ అధికారులు, డ్యాం సేఫ్టీ, ఇంజనీరింగ్ నిపుణలు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.
ఆయన ఆధ్వర్యంలోనే మరమ్మతులు
రిటైర్డ్ ఇంజినీర్, సాంకేతిక సలహాదారులు నాగినేని కన్నయ్య నాయుడు నీటిపారుదల ప్రాజెక్టుల్లో గేట్లు ఏర్పాటు చేయడం, మరమ్మతు చేయడంలో దిట్ట. ఆగస్టులో తుంగభద్ర జలాశయంలో వరదలకు కొట్టుకుపోయిన క్రస్టుగేటు స్థానంలో.. కేవలం వారం రోజుల్లోనే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం.. జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా ఆయనను నియమించింది. 2024 ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇయన ఆధ్వర్యంలోనే బ్యారేజీ మరమ్మతు పనులు చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కుట్ర జరిగిందన్న వార్తలు బలంగా తెరపైకి వచ్చాయి. ఐదు రోజుల తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు(Irrigation officials) ఫిర్యాదు చేయటంతో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం వెనక నిజంగానే కుట్ర ఉందా..? అన్న చర్చ మొదలైంది. మరి పోలీసుల విచారణలో ఏం తేలతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.