Mana Enadu: కలియుగ దైవం.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు. తిరుమల ఏడుకొండలపై కొలువైన శ్రీ వేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. రకరకాల పుష్పాలతో అలకరంచే శ్రీవారిని కనులారా చూడటానికి రెండు కళ్లూ చాలవు. పువ్వులతోనే కాదు రకరకాల నగలతో అలకరించే వెంకన్నను దర్శించుకోవాటానికి నిత్యం దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని. శ్రీవారి దర్శనానికి సామాన్యులే కాదు సినిమా సెలబ్రిటీలు., రాజకీయ ప్రముఖులు., క్రీడాకారులు కూడా వస్తుంటారు. మరి అలాంటి గోవిందుడిని చూసేకుందుకు తాజాగా ఓ ఫ్యామిలీ తిరుమలకు చేరుకుంది. అంతే.. దేవుడి దగ్గరికి వెళ్లే వారి కళ్లన్నీ వారివైపే చూశాయ్.. వామ్మో అని ముక్కున వేలేసుకునేలా చేసిందా ఫ్యామిలీ.. ఇంతకీ ఏంటి ఆ ఫ్యామిలీ స్పెషల్? తెలియంటే ఈ వార్త చదవాల్సిందే..
సాధారణంగా భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా సరే జనం పుత్తడి కొనేందుకు పరుగులు తీస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఇలా చేస్తుంటారు. పేద, మధ్య తరగతి వారైతే 10 తులాలు, కాస్త ఆర్థికంగా ఎదిగిన వారైతే 10-20 తులాల మధ్య కొనుగోలు చేయడం సహజం. మరి ఆ ఫ్యామిలీ తిరుమలకు వచ్చిన సందర్భంగా ధరించిన బంగారు ఆభరణాల బరువు ఎంతో తెలిస్తే మీరూ షాక్ అవ్వాల్సిందే..
25 కేజీల గోల్డ్ ఫ్యామిలీతో జనం సెల్ఫీ
తాజాగా తిరుమల వేంకటేశుడి దర్శనం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్‌లో తమవైపు తిప్పుకునేలా చేసింది ఓ భక్త బృందం. ముగ్గురు వ్యక్తులు ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో అభరణాలు ధరించడం చూసి శ్రీవారి భక్తులు నోరెళ్లబెట్టారు. పుణెకు చెందిన ‘గోల్డ్ భక్తులు’ శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకన్నారు. గోల్డెన్‌మాన్లు సన్నీ నన వాగ్చోరీ , సంజయ్ దత్తత్రయ గుజర్ , ప్రీతి సోని రెండు చేతుల్లో వేళ్లకు సరిసమానంగా చేతి ఉంగరులు.,రెండు చేతులకు భారీ కంకణాలు., మెడలో పెద్ద చైన్లను ధరించారు. వీరి ఒంటిపై దాదాపు 25 కేజీల బరువు గల బంగారు అభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.
https://x.com/TimesNow/status/1826859665059143753