iPhone : ఐఫోన్ 14, 15 ధరలు తగ్గాయోచ్.. లేటెస్ట్ ధరలు ఎంతంటే?

ManaEnadu:యాపిల్ (Apple Company) తన వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఐఫోన్ 16 (iPhone 16) మొబైల్​ను లాంఛ్ చేసి కస్టమర్లకు సర్​ప్రైజ్ ఇచ్చిన ఈ కంపెనీ తాజాగా పాత ఉత్పత్తుల ధరలు తగ్గించింది. విడుదల చేసినప్పటి ధరలతో పోలిస్తే రూ.10వేల వరకు పాత మోడల్స్​పై డిస్కౌంట్‌ ప్రకటించింది. మరోవైపు మరికొన్ని పాత మోడళ్ల తయారీనే నిలిపివేసింది. మరి ఏ మోడల్స్ ధరలు ఎంత ఉన్నాయంటే?

ఐఫోన్ 14, 15 లేటెస్ట్ ధరలు ఇవే..

యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్ల (Apple Online Stores)లో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 14 సిరీస్‌ ధరలు రూ.10వేల వరకు తగ్గాయి. గతేడాది ఐఫోన్‌ 15 (iPhone 15) 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 ఉండగా ప్రస్తుతం ఆ ధర రూ.69,900కు తగ్గింది. 256 జీబీ వేరియంట్‌ ధర రూ.79,900గా ఉంది. మరోవైపు ఐఫోన్‌ 14 (iPhone 14) సిరీస్‌ ధరలు దేశీయంగా రూ.59,900 (128జీబీ వేరియంట్) నుంచి మొదలవ్వనున్నాయి. గతంలో దీని ధర రూ.69,900 ఉన్న సంగతి తెలిసిందే. 256 జీబీ వేరియంట్‌ ధర రూ.69,900, 512 జీబీ వేరియంట్‌ రూ.89,900 ఉంది.

ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ తయారీ నిలిపివేత

మరోవైపు ఐఫోన్‌ 16ను విడుదల చేయడంతో ఐఫోన్‌ 15ప్రో (iPhone 15 Pro), ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ తయారీని నిలిపివేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఐఫోన్‌ 13, వాచ్‌ సిరీస్‌ 9ను కూడా నిలిపివేసినట్లు వెల్లడించింది. యాపిల్ కొత్త మోడళ్ల ధరలు కొనలేని వాళ్లు.. యాపిల్ ఫోన్లకు ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ కొనసాగిస్తుండడం వల్ల తక్కువ ధరకే లభించే పాత మోడళ్లను కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక యాపిల్‌ తాజాగా లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 16 ధర (iPhone 16 Price) రూ.79 వేల నుంచి షురూ కానుంది. ఐఫోన్‌ 16 ప్లస్‌ రూ.89,900, ఐఫోన్‌ 16 ప్రో రూ.1.19 లక్షలు, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1.44 లక్షలు ఉంది. సెప్టెంబర్‌ 13 నుంచి ప్రీ ఆర్డర్లు.. సెప్టెంబర్‌ 20 నుంచి విక్రయాలు షురూ కానున్నాయి.

Share post:

లేటెస్ట్