ఐఫోన్‌ 16 వచ్చిందోచ్‌.. ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే

ManaEnadu:యాపిల్ (APple) యూజర్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎక్కువ మంది మెచ్చే ఐఫోన్‌లో మరో అప్డేటెడ్ మొబైల్ వచ్చేసింది. ఎంతో కాలం నుంచి అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 (iPhone 16) ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో, అధునాతన కెమెరా కంట్రోల్‌, ఏ18చిప్‌ ఇందులో బెస్ట్ ఫీచర్స్. ఐఫోన్ 16 మొబైల్స్‌తో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, వాచ్‌ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్‌ 4, ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్ (Aipods Max), ఎయిర్‌పాడ్స్‌ ప్రొ 2లను సోమవారం రోజున ఈ సంస్థ భారత్‌లో ఆవిష్కరించింది.

ఐఫోన్‌ 16 సిరీస్‌లో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్ (iPhone 16+), ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ 16 ప్రొ మ్యాక్స్‌.. అనే నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ తరహాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో వీటిని తీసుకొచ్చింది. కొత్త ఫోన్లు ఐఓఎస్‌18 (iOS 18)తో పనిచేస్తాయి.

ఐఫోన్‌ 16 ఫీచర్స్ ఇవే (iPhone 16 Features)..
డిస్‌ప్లే : 3.10 అంగుళాలు
ప్రాసెసర్ : యాపిల్ ఏ18
ఫ్రంట్ కెమెరా : 12 MP
రేర్ కెమెరా : 48 MP+12 MP
RAM : 8GB
స్టోరేజ్ : 12 GB
OS : iOS 18
ధర : రూ. 79,000

ఐఫోన్‌ 16 ప్లస్ ఫీచర్స్ ఇవే (iPhone 16+ Features)..
డిస్‌ప్లే : 6.70 అంగుళాలు
ప్రాసెసర్ : యాపిల్​ ఏ18
ఫ్రంట్ కెమెరా : 12MP
రేర్ కెమెరా : 48MP+12MP
RAM : 8GB
స్టోరేజ్ : 128GB
OS : iOS 18
ధర : రూ.89,000

ఐఫోన్‌ 16 ప్రో ఫీచర్స్ ఇవే (iPhone 16 Pro Features)..
డిస్‌ప్లే : 6.3 అంగుళాలు
ప్రాసెసర్ : యాప్రిల్ ఏ18 ప్రొ
ఫ్రంట్ కెమెరా : 12MP
రేర్ కెమెరా : 48MP+48MP
RAM : 8GB
స్టోరేజ్ : 128GB( బేస్​ మోడల్)
OS : iOS 18
ధర : రూ.1,19,900

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్ ఫీచర్స్ ఇవే(iPhone 16 Pro Max Features)..
డిస్‌ప్లే : 6.9 అంగుళాలు
ప్రాసెసర్ : యాప్రిల్ ఏ18 ప్రొ
ఫ్రంట్ కెమెరా : 12MP
రేర్ కెమెరా : 48MP+48MP
RAM : 8GB
స్టోరేజ్ : 128GB( బేస్​ మోడల్)
OS : iOS 18
ధర : రూ.1,44,900
సెప్టెంబర్‌ 13 నుంచి ఐఫోన్​ 16 సిరీస్​ ఫోన్ల ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి

Share post:

లేటెస్ట్