ManaEnadu:సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. అన్నదమమ్ములు తమ అక్క చెల్లెల్లకు రక్షణగా నిలుస్తామని భరోసా కల్పిస్తూ వారికి బహుమతులు ఇస్తారు. ఆగస్టు 19వ తేదీన దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏ సమయంలో రాఖీ కట్టకూడదు? ఏ సమయంలో కడితే మంచి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
శ్రావణ పౌర్ణమి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19, 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. భద్ర కాలం సమయం సోమవారం సూర్యోదయం 5:53 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండగను జరుపుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం 1:33 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ సమయం ఉందని.. ఈ సమయంలో రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు. మధ్యాహ్నం 1:43 గంటల నుంచి సాయంత్రం 4:20గంటల వరకు, సాయంత్రం 6:56 గంటల నుంచి రాత్రి 9:08 గంటల మధ్య సమయంలో రాఖీ కడితే సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.