ManaEnadu:బిగ్‌బాస్ (Bigg Boss) రియాల్టీ షోలో వీకెండ్ ఎపిసోడ్ కాకుండా అందరికీ నచ్చే ఎపిసోడ్ నామినేషన్స్ డే. సాధారణంగా ఈషోను ఫాలో అవ్వని వాళ్లు కూడా కచ్చితంగా నామినేషన్స్ ఎపిసోడ్ చూస్తుంటారు. నామినేషన్స్ సమయంలో హౌజులో జరిగే హంగామా, కంటెస్టెంట్ల మధ్య వార్‌ను చూసి థ్రిల్ అవుతారు. ఈ ఎపిసోడ్లో కంటెస్టెంట్ల మెంటాలిటీ ఏంటో తెలిసిపోతుంది.అందుకే ఇదంటే ప్రేక్షకులకు ఇష్టం.
ఇక తాజాగా మొదలైన తెలుగు బిగ్‌బాస్-8 అప్పుడే మూడో రోజుకు వచ్చేసింది. సోమవారం రోజు ఇంటికి ముగ్గురు చీఫ్‌ల ఎన్నిక, మంగళవారం నుంచి నామినేషన్ ప్రక్రియ (Bigg Boss Nominations) షురూ అయి బుధవారం కూడా కంటిన్యూ అయింది. ఈ నామినేషన్ ఎపిసోడ్ మొదట కాస్త చప్పగా మొదలై తర్వాత కొంత గోల.. మరికొంత కన్నీళ్లతో మొత్తానికి ఎలాగోలా పూర్తైపోయింది. మరి ఈ సీజన్-8 తొలి వారంలో నామినేట్ అయిన వాళ్లెవరో చూద్దామా?
మొదట ఆదిత్య ఓం వచ్చి పృథ్వీని క్లీనింగ్ విషయంలో, శేఖర్ బాషా లేజీగా ఉన్నాడంటూ నామినేట్ చేయగా పృథ్వీని సేవ్ చేసి బాషాను నామినేట్ చేశారు చీఫ్స్. కిరాక్ సీత.. ప్రేరణ, బేబక్కను నామినేట్ చేయగా ప్రేరణను సేవ్ చేసి.. బేబక్క ఓటేశారు చీఫ్స్. అభయ్ మొదటిగా మణికంఠ, బేబక్క నామినేట్ కాగా చీఫ్ యష్మీ మణికంఠను నామినేట్ చేసింది. విష్ణుప్రియ (Vishnu Priya), శేఖర్ , సోనియాను నామినేట్ చేయగా.. లాంగ్ ఆర్గ్యుమెంట్ తర్వాత వీరిలో శేఖర్‌ను నామినేట్ చేస్తూ యష్మీ డెసిషన్ తీసుకుంది.
ప్రేరణ.. మణికంఠ (Manikantha)ను నామినేట్ చేయగా పెద్ద రచ్చ జరిగింది. అతడు తన లైఫ్‌లో పడ్డ కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్వడంతో హౌజులో అమ్మాయిలందరూ ట్యాప్ తిప్పేశారు. ఇక మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి, రెండో నామినేషన్ శేఖర్ బాషాకి వేశాడు మణికంఠ. వీరిద్దరిలో శేఖర్ బాషాను సేవ్ చేసి చీఫ్ యష్మీ (Yashmi) విష్ణును నామినేట్ చేసింది.
పృథ్వీ మొదటి నామినేషన్ బేబక్క, రెండోది మణికంఠను చేశాడు. మణికంఠను నామినేట్ చేసి బేబక్కను నైనిక సేవ్ చేయడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అలా ఈ వారం సోనియా, బేబక్క, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.







