ManaEnadu:’బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పంది.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పింది.. అమ్మో.. బాపుగారి బొమ్మో’ ఈ పాట వింటుంటే మీ మైండ్లో టాలీవుడ్ నటి ప్రణీత (Pranitha Subhash) మెదులుతోంది కదా. తన బొంగరం లాంటి కళ్లతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ప్రణీత. అత్తారింటికి దారే (Atharintiki Daaredi)ది సినిమాతో తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. ఈ భామ చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది.
ప్రణీతకు పండంటి మగబిడ్డ..
ప్రణీత ఇప్పటికే ఓ బిడ్డకు తల్లయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ భామ రెండోసారి తల్లయింది. బుధవారం రోజున పండంటి మగబిడ్డ (Baby Boy)కు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన బాబు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ప్రణీతకు కంగ్రాట్స్ చెబుతున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’తో ఎంట్రీ
టాలీవుడ్లో ప్రణీత ‘‘ఏం పిల్లో.. ఏం పిల్లడో(em pillo em pillado)’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కన్నడ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది.
కరోనా సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని ప్రణీత వివాహ మాడింది. 2021లో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రణీత-నితిన్ (Pranitha Weds Nitin Raj) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2022లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రెండో కాన్పులో ఈ బ్యూటీ పండంటి మగబిడ్డను కన్నది.
. @pranitasubhash looks stunning during her pregnancy, glowing with natural beauty and radiant joy, embracing motherhood gracefully.#PranithaSubhash #KollywoodCinima pic.twitter.com/j9b1ZWmwhh
— Kollywood Cinima (@KollywoodCinima) August 25, 2024