ManaEnadu:నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. దసరా, హాయ్ నాన్న (Hi Nanna), ఇటీవల వచ్చిన సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ కొట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్ మీదున్న ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టాడు. నాని తదుపరి సినిమాల్లో ఒకటి టాలీవుడ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో రాబోతున్న HIT: The 3rd Case తన సొంత బ్యానరల్ వచ్చిన హిట్, హిట్-2 (HIT-2)లు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. హీరోగా హ్యాట్రిక్ కొట్టిన నాని, తన సొంత బ్యానర్లో వస్తున్న హిట్ ఫ్రాంఛైజీ సినిమాల్లోనూ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
హిట్ ఫ్రాంఛైజీలో తాజాగా రాబోతున్న సినిమా హిట్-ది థర్డ్ కేసు. ఈ మూడో భాగంగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ (HIT: The 3rd Case Glimpse)ను రిలీజ్ చేశారు మేకర్స్. అర్జున్ సర్కారు టేక్స్ ఛార్జ్ అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అతడు పోలీసుకు తక్కువ.. క్రిమినల్‌కు ఎక్కువగా అంటూ నాని క్యారెక్టర్ గురించి వివరించారు.
“ఈ గ్లింప్స్ వీడియోలో బనిహాల్ పాస్ దగ్గర ఓ బొలెరో వెళ్తోంది.. అందులో మీ ఆఫీసర్ ఉన్నారా? ఉంటే ఆయన ప్రమాదంలో ఉన్నారంటూ ఓ వ్యక్తి సమాచారం అందించగా.. టెంట్లో ఉన్న మరో ఆఫీసర్.. డేంజర్లో ఉన్నాడని మీరంటున్న ఆఫీసరే పెద్ద డేంజర్” అంటూ మరో ఆఫీసర్ సమాధానమిస్తాడు. ఆ తర్వాత బొలేరో వాహనంలో నాని డ్రైవ్ చేస్తూ సిగరెట్ తాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. గెట్.. సెట్.. గో అంటూ నాని చెప్పిన డైలాగ్‌తో ఈ గ్లింప్స్ వీడియో ముగుస్తుంది.
గ్లింప్స్ చూస్తుంటే.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ (Arjun Sarkar) అనే పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. హిట్ సినిమా ఫ్రాంచైజీ విషయానికి వస్తే.. నాని నిర్మాణంలో ఈ సినిమాలు వచ్చాయి. మొదటి పార్ట్‌లో విష్వక్ సేన్-రుహానీ శర్మ నటించగా.. సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ (Adivis Sesh) – మీనాక్షి చౌదరి నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు రాబోతున్న HIT: The 3rd Case హిట్ అయితే నాని నిర్మాతగా హ్యాట్రిక్ కొట్టినట్లవుతుంది. (Nani)
https://twitter.com/NameisNani/status/1831566503168123204