Malakjgiri|సీఎం రేవంత్​ సిట్టింగ్​ స్థానంపై..బీఆర్​ఎస్​ ఆశలు గల్లంతు

Mana Enadu: మల్కాజిగిరి పార్లమెంటు బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందరికంటే ముందే ప్రకటించిన బీజేపీ అభ్యర్థి ఓ వైపు ప్రచారంలో దూసుకపోతున్నారు. తన గెలుపుకు అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకెళ్తున్నారు.

బీఆర్​ఎస్​ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ శ్రేణులకు భరోసా ఇవ్వలేకపోతుంది. ఒకవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వంతోపాటు బీజేపీ పదునైన విమర్శలు చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో కారు నేతల తీరు చూస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి సిట్టింగ్​ పార్లమెంటు స్థానంలో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసే నాయకుడే లేడానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్​ బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ ఇద్దరు, ముగ్గురు పేరు పరిశీలిస్తుంది. గురువారం బీఆర్​ఎస్​ ప్రకటించిన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

బీఆర్​ఎస్​ పార్టీ తొలుత మల్లారెడ్డి అల్లుడు ఆతర్వాత కొడుకు అనుకున్నారు. చివరకు మల్లారెడ్డి పోటీలో ఉండటం లేదని తప్పుకున్నారు. ఒక్కసారిగి శంబీపూర్​ రాజు మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ చివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్​లో ఉప్పల్​ టిక్కెట్​ ఆశించి భంగపడి బీఆర్​ఎస్​లో చేరిన నేతలకు పార్లమెంటు అభ్యర్థిగా టిక్కెట్​ ఇవ్వడం పట్ల కేసీఆర్​ ఆలోచనలు అంతుచిక్కడం లేదు.
ఈటెల గెలుపు కోసమే బీఆర్​ఎస్​ అభ్యర్థి ప్రకటన తీరు ఉందని రాజకీయ వర్గాల నేతలు భావిస్తున్నారు. ఉప్పల్​ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించినా అవకాశం ఇవ్వలేదు. రేవంత్​రెడ్డి సిట్టింగ్​ స్థానంపై బలమైన అభ్యర్థిని నిలబెట్టలేని కేసీఆర్​ గులాబీ జెండా పీకేసినట్లేనా అనే ప్రచారం జరుగుతుంది.

Share post:

లేటెస్ట్