ManaEnadu: తెలంగాణలోని ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) అందించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revant reddy) అధికారులను ఆదేశించారు. ఈమేరకు అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. పేద, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాలు వైట్ రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యవసరాలను పంపణి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా రాష్ట్రంలో అర్హులైన వారు కొత్త రేషన్ కార్డులు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుభవార్త(Good News) చెప్పడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ కార్డులపైనా కసరత్తు చేయండి: CM
రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కసరత్తు చేస్తోందని CM రేవంత్ చెప్పారు. ఇదే విషయంపై ఆయన సంబంధిత మంత్రులు, అధికారులతో సమీక్షించారు. కొత్త కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల(On procedures)పై పలు సూచనలు చేశారు. అక్టోబరు 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని CM ఆదేశించారు. అలాగే అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు(Digital Ration Cards) ఇచ్చేదానిపై కసరత్తు చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, CS శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.