Rohit Sharma: ‘ముంబై ఇండియన్స్‌’తో హిట్‌మ్యాన్ జర్నీ ముగిసినట్లే: మాజీ క్రికెటర్

Mana Enadu: టీమ్ ఇండియా(TeamIndia) సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా హిట్ మ్యాన్‌(Hitman)కు అభిమానులు ఉన్నారు. అటు రోహిత్ కూడా T20, ODIలు, టెస్టులు అనే తేడా లేకుండా పరుగులు సాధిస్తూనే ఉన్నారు. ఇటీవల భారత్‌కు T20 World Cup అందించిన రోహిత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమ్ఇండియాకు వన్డేలు, టెస్టులకు హిట్ మ్యాన్ కెప్టెన్‌(Captain)గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా IPLలో రోహిత్ శర్మ ఎంత స్పెషల్ ప్లేయరో అందరికీ తెలుసు. Mumbai Indiansకు కెప్టెన్‌గా వ్యవహరించి ఐదు టైటిల్స్(5 Titles) అందించాడు హిట్ మ్యాన్. అయితే గత సీజన్లో MI యాజమాన్యం రోహిత్‌ను అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ బాధ్యతలు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya)కు అప్పజెప్పింది. అయితే హార్దిక్ కెప్టెన్సీలో ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది. అయితే అప్ప‌టి నుంచి ముంబై జట్టులో రోహిత్ భ‌విత‌వ్యంపై చ‌ర్చ మొద‌లైంది. వ‌చ్చే ఏడాది మెగా వేలం(IPL Mega Auction) ఉండ‌డంతో ఈ చ‌ర్చ‌లు తారస్థాయికి చేరాయి. హిట్‌మ్యాన్ MIలో కొన‌సాగుతాడా ఫ్రాంచైజీ అత‌డిని వ‌దిలేస్తుందా రోహిత్ వేరే జ‌ట్టుకు వెళ్లిపోతాడా అనే ప‌లు ప్ర‌శ్న‌లు అభిమానుల‌ను తొలచివేస్తున్నాయి.

అతను ముంబై జట్టులో కొనసాగడం కష్టమే: ఆకాశ్ చోప్రా

ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) MIలో రోహిత్ శ‌ర్మ కొన‌సాగ‌డంపై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. MIతో హిట్‌మ్యాన్ ప్ర‌యాణం ముగిసిన‌ట్లేన‌ని చెప్పాడు. ఈ మాజీ కెప్టెన్‌ను ఈసారి MI రిటైన్ చేసుకోద‌ని పేర్కొన్నాడు. రోహిత్‌కూ ఆ జ‌ట్టులో కొన‌సాగ‌డం ఇష్టంలేద‌ని చెప్పాడు. ఫ్రాంచైజీ అత‌డిని విడుద‌ల చేయ‌వ‌చ్చ‌ని తెలిపాడు. త‌న యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసిన వీడియోలో ముంబైలో రోహిత్ భ‌విత‌వ్యంపై చోప్రా ఈ వ్యాఖ్య‌లు చేశాడు.”అత‌ను ముంబైలో ఉంటాడా లేక వెళ్తాడా? ఇది పెద్ద ప్రశ్న. వ్యక్తిగతంగా నాకు తెలిసి అతను ఉండడని భావిస్తున్నాను. మీ పేరు MS Dhoni అయితే.. త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని రిటైన్ చేసుకుంటార‌ని చెప్పొచ్చు. MSD, CSK కథ చాలా భిన్నమైంది. కానీ MI ప‌రిస్థితి వేరు. ఇక్క‌డ‌ స్వయంగా రోహిత్ శర్మ వెళ్లిపోవచ్చు, లేదా MI అతనిని విడిచిపెట్టవచ్చని భావిస్తున్నాను” అని చోప్రా అభిప్రాయ‌ప‌డ్డాడు. మరోవైపు సూర్య కుమార్ యాద‌వ్‌(SKY)ను ముంబై వ‌దిలేస్తుందా అనే ప్ర‌శ్న‌కు ఆకాశ్ చోప్రా భిన్నంగా స్పందించాడు. సూర్య‌ను ఆ ఫ్రాంచైజీ ఇప్ప‌ట్లో వ‌దులుకోద‌ని తెలిపాడు. “మీరు ఏమి అడుగుతున్నారు? సూర్యకుమార్ యాదవ్‌ని ఆ జ‌ట్టు వ‌దిలేయడం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌దు. అలాగే సూర్య కూడా ముంబైని వదిలిపెట్టడు. ఆ జ‌ట్టుతోనే కొన‌సాడుతాడు” అని చోప్రా చెప్పాడు.

 

 రోహిత్ క్రికెట్ కెరీర్ ఇలా..

ఇదిలా ఉండగా అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా తరఫున రోహిత్ శర్మ కీలక ప్లేయర్‌గా రాణిస్తున్నాడు. రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో 59 మ్యాచుల్లో 12 శతకాలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 4,137 రన్స్ చేశాడు. అలాగే 265 వన్డేల్లో 31 సెంచరీలు, 57 అర్ధశతకాలతో మొత్తం 10,866 పరుగులు రాబట్టాడు. ఇక పొట్టి ఫార్మాట్ టీ20ల్లో 159 మ్యాచులు ఆడిన రోహిత్ 5 శతకాలు, 32 ఫిఫ్టీస్ సాధించి మొత్తం 4231 రన్స్ పిండుకున్నారు. ఇక IPLలో హిట్ మ్యాన్ 257 మ్యాచులకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు చేసి మొత్తం 5054 రన్స్ సాధించాడు.

 

Share post:

లేటెస్ట్