Mana Enadu: టీమ్ఇండియా అభిమానులకు గుడ్‌న్యూస్. భారత T20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. గాయం నుంచి SKY(సూర్య కుమార్ యాదవ్) కోలుకున్నట్లు నేషనల్ క్రికెట్ అకాడమీ పేర్కొంది. బంగ్లాతో టీమ్ ఇండియా అక్టోబర్ 6వ తేదీ నుంచి 3 టీ20ల సిరీస్ ఆడనుంది. ఇటీవల TNCA ఎలెవన్‌తో జరిగిన బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో సూర్య ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు మైదానాని పూర్తిగా దూరమయ్యాడు. దీంతో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమైన దులీప్ ట్రోఫీలోనూ సూర్య బరిలోకి దిగలేదు. అతను INDIA-C జట్టు తరఫున ఆడాల్సి ఉంది. కానీ గాయంతో సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని NCAకి వెళ్లాడు.
ఫైనల్ చెకప్ తర్వాతే క్లారిటీ: BCCI
కాగా రోజుల వ్యవధిలోనే సూర్య గాయం నుంచి కోలుకున్నాడు. ‘‘సూర్య కుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను దాదాపు 100 శాతం ఫిట్‌గా ఉన్నాడు’’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చాయి. ‘‘బీసీసీఐ మెడికల్ టీం ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ గాయాన్ని అంచనా వేస్తూనే ఉంది. వచ్చే వారం ఫైనల్ చెకప్ తర్వాత దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచ్‌ల్లో అతను ఆడటంపై క్లారిటీ వస్తుంది’’ అని బీసీసీఐ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ INDIA-A vs INDIA-B మ్యాచ్ సమయంలో చిన్నస్వామి స్టేడియంలోనే ఉన్నాడు. టీమ్ మెంబర్స్‌తో చాలా సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. అయితే గాయంతో అతడు గాయం నుంచి కోలుకోలేదని భావించిన BCCI రెండో రౌండ్ మ్యాచులకు సూర్యను ఎంపిక చేయలేదు. మరోవైపు అతడి స్థానంలోనూ ఎవరినీ ఎంపిక(Select) చేయలేదు.
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికవ్వాలంటే సత్తా చాటాల్సిందే..
ఇండియా-బితో జరిగే తదుపరి మ్యాచ్‌లో సూర్య ఆడితే 14 నెలల తర్వాత అతడికి ఇదే తొలి Red Ball మ్యాచ్ అవుతుంది. గత ఏడాది Duleep Trophyలోనే అతను చివరి రెడ్ బాల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ, టెస్టుల్లో రీఎంట్రీకి సూర్యకి చాలా కీలకం.T20ల్లో SKY మంచి ప్లేయర్ అయినప్పటికీ.. ODI, టెస్టుల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. వన్డేల్లో అతనికి చాలా అవకాశాలు లభించినప్పటికీ 35 ఇన్నింగ్స్‌ల్లో 25 AVGతో మాత్రమే పరుగులు చేయగలిగాడు. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అవకాశం వచ్చినా.. గాయం కారణంగా కేవలం ఒక టెస్టు తర్వాత అతను సిరీస్‌కి దూరమయ్యాడు. సూర్య టెస్టుల్లోకి పునరాగమనం చేయాలంటే దులీప్ ట్రోఫీ అతడికి కీలకం. ఇక్కడ రాణిస్తేనే మున్ముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు పోటీలో ఉండే ఛాన్స్ ఉంటుంది.