Mana Enadu: జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)… భారత క్రికెట్లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఈ పేరు తెలియని వారండరు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతెప్పలు పెడుతుంటాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. పేస్, స్లో బాల్స్, బౌన్సర్స్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ఇలా బుమ్రా చేతినుంచి ఒక్కో సమయంలో ఒక్కో బంతి.. ప్రతిదీ ఆణిముత్యమే. అరవీర భయకరమైన బ్యాట్స్‌మెన్ సైతం బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతుంటారు. అందుకే ఈ స్పీడ్ గన్‌ను భారత క్రికెట్లోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా అభివర్ణిస్తుంటారు మాజీ ప్లేయర్లు, క్రికెట్ పండితులు. భారత్ T20 World Cup-2024 గెలవడంలో బుమ్రాది కీలక పాత్ర. ఆ తర్వాత భారత్ శ్రీలంక(Srilanka Vs India) టూర్‌కు వెళ్లినా సెలక్టర్లు ఈ పేస్ స్టార్‌కు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం బుమ్రా ఈ ఖాళీ సమయంలో ఫ్యామిలీ కలిసి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నెల బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనున్న టెస్ట్ సిరీస్(Tests)లో బుమ్రా ఎంటీ ఇవ్వనున్నాడు.
బుమ్రాకు విద్యార్థుల ప్రశ్నలు
ఇదిలా ఉండగా బుమ్రా తాజాగా తమిళనాడులోని సత్యభామ వర్సిటీ(Satyabama University)కి వెళ్లాడు. అక్కడ బుమ్రాకి విద్యార్థులు పలు ప్రశ్నలు సంధించారు. అందులో ఓ ప్రశ్నకు బుమ్రా చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఇంతకీ ప్రశ్నేంటంటే.. ‘కెరీర్‌లో మీరు బౌలింగ్ చేసిన టఫెస్ట్ బ్యాటర్ ఎవరు(Toughest Batter To Bowl To)?’ అని ప్రశ్నించగా.. జస్‌ప్రీత్ బుమ్రా చాలా తెలివిగా ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు. సాధారణంగా ఇప్పటి వరకు బౌలర్లు ఇలాంటి ప్రశ్న ఎదురైతే బ్యాటర్ల పేర్లు చెప్తుంటారు. కానీ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఏ బ్యాటర్ పేరు చెప్పలేదు.
ఆధిపత్యం చెలాయించకుండా..
‘నేను బౌలింగ్ చేసేటప్పుడు తొలుత ఏ బ్యాటర్ (Batsman) కూడా నాపై ఆధిపత్యం చెలాయించకుండా జాగ్రత్తపడతా. అందుకు తగినట్లుగా నేను ప్రిపేర్ అవుతా.. నా మైండ్‌ను కూడా ప్రిపేర్ చేసుకుంటా. నా సామర్థ్యాన్ని నమ్మి నా పని నేను చేస్తాను. అలా అని బ్యాటర్లను తక్కువ చేయడం కాదు. నేను బౌలింగ్ చేసే ప్రతి బ్యాటర్‌నీ గౌరవిస్తా. కానీ మన పని మనం కరెక్ట్ చేస్తే ప్రపంచంలో మనల్ని ఎవరూ ఆపలేరు. అదొక్కటే నేను మననం చేసుకుంటా’ అని జస్‌ప్రీత్ వెల్లడించాడు. కాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా(SA)తో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. దాంతో బుమ్రాకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా దక్కింది.