విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్నారా?.. ఐతే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

Mana Enadu:చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటారు. ఫారిన్ డిగ్రీలపై నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడే చదవి, అక్కడే సెటిల్ అయిపోవాలని కలగంటోంది నేటి యువత. అందుకోసం చదువుకునే సమయం నుంచే పక్కా ప్లానింగ్ చేసుకుంటోంది. అయితే మీరు కూడా విదేశాల్లో చదవుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? అక్కడికి వెళ్లాలన్నా.. ఫారిన్​లో చదవాలన్నా చాలా డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?

విదేశాల్లో విద్యకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే:

విద్యార్థుల అకడమిక్‌ డాక్యుమెంట్లు, డిప్లొమా, గతంలో చదివిన విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలి.

విదేశాలకు వెళ్లే వారికి పాస్​పోర్ట్ తప్పనిసరి. అందుకే మొదట పాస్​పోర్ట్ రెడీ చేసుకోవాలి.

మీరు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా.. ఇలా ఏ దేశానికి వెళ్లాలనుకుంటున్నారో ఆ దేశానికి సంబంధించి వీసా ఉండాలి

ఇక తప్పకుండా మీరు రెజ్యూమె రెడీగా చేసుకోవాలి. అందులో మీ అకడమిక్ వివరాలు, వర్కింగ్ ఎక్స్​పీరియెన్స్, ఇతర నైపుణ్యాలు పొందుపరచాలి. ముఖ్యంగా జీఆర్‌ఈ, ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్‌ టెస్ట్ స్కోర్ కూడా యాడ్ చేయాలి.

మీ అప్లికేషన్​ను సమర్థిస్తూ టీచర్ లేదా ప్రొఫెసర్ రికమండేషన్ లెటర్ ఉండాలి
బ్యాంక్‌ స్టేట్​మెంట్​ కచ్చితంగా ఉండాలి. ఫైనాన్షియల్‌ ప్రూఫ్‌ చూపిస్తేనే విదేశాల్లోకి అనుమతి ఉంటుంది.

ఏదైనా స్కాలర్‌షిప్‌ లేదా ఫైనాన్సియల్‌ అవార్డుకు ఎంపికైతే వాటికి సంబంధించిన లెటర్‌ను ఉండాలి.

స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌: విదేశాల్లో ఎందుకు చదవాలనుకుంటున్నారో, విద్య, జీవిత లక్ష్యాలను వివరిస్తూ ఒక స్టేట్‌మెంట్‌ సిద్ధం చేసుకోవాలి.
స్పాన్సర్‌షిప్ అఫిడవిట్‌ : విదేశీ చదువులకు ఆర్థిక సాయానికి సంబంధించిన చట్టబద్ధత కల్పించే డాక్యుమెంట్‌ ఉండాలి.
మీ విద్యా రుణాలు లేదా ఆర్థిక సాయాన్ని నిర్ధరించే లెటర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

 

Share post:

లేటెస్ట్