Kejriwal Arrest|ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్​..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సమన్లు అందజేసేందుకు ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఇప్పటికే చేరుకున్నారు. దాదాపు 8 మంది దర్యాప్తు అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన గంటన్నరలోనే సీఎం కేజ్రీవాల్​ను ఈడీ అధికారులు అరెస్ట్​ చేశారు.

 CM Arvind Kejriwal arrest: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బ్రుందం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఎం నివాసం దగ్గర సిబ్బంది ఆరా తీయగా..సెర్చ్ వారెంట్ తోనే వచ్చామని చెప్పినట్లు సమాచారం. మద్యం పాలసీకి (Liquor Policy) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే 9సార్లు ఈడీ సమన్లు ఇచ్చినా కూడా కేజ్రీవాల్ హజరయ్యేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కాగా మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో (Money Laundering Case) కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు ఉపశమనం లభించలేదు. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి నేపథ్యంలో ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకోని సోదాలు జరుపుతున్నారు. ఈడీ కార్యాలయానికి సీఎం కేజ్రీవాల్​ తీసుకెళ్లేందుకు అధికారులు సిద్దం అయ్యారు. నోటీసుల అందించిన కొద్ది గంటల్లోనే సీఎం కేజ్రీవాల్​ అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున ఆప్​ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

Share post:

లేటెస్ట్