మన ఈనాడు: గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఖమ్మం అర్భన్ మండలం దంసలాపురం, చింతకాని మండలాలు రైతులు హైవే పనులు వద్ద ఆందోలన చేపట్టారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే రావటంతో అక్కడి రైతులు సంబురపడ్డారు. తమ గ్రామలు మేలు చేకూరుతుందని ఆశించారు. దంసలాపురం వద్ద ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేస్తామని హైవే కోసం భూసేకరణ చేసే సమయంలో అధికారులు హమీనిచ్చారని వాపోయారు.
గ్రీన్‌ఫీల్డ్ పనులు జరుగుతున్న క్రమంలో మధిర, బోనకల్లు, ముదిగొండ మండలాల రైతులు రాకపోకలకు జాతీయ రహదారి అనుకూలంగా ఉండాలన్నారు. ఎగ్జిట్ లేకుండా నిర్మాణ పనులు పూర్తి చేస్తుండగా 200మందికి పైగా రైతులు బుధవారం ఆందోళన చేశారు.
జాతీయ రహదారి తమ గ్రామ ప్రజల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం అయితే భూములు ఎందుకు ఇస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి గ్రీన్ ఫీల్డ్ హైవే (NH-365 BG) నిర్మాణంలో బోనకల్ రోడ్డు కలుపుతూ ఖమ్మం -ధ్వంసాలాపురం గ్రామం వద్ద ఎగ్జిట్ పాయింట్ డిమాండ్ చేసారు. లేని పక్షం లో నిర్మాణ పనులు అడ్డుకుంటాం రైతులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో రైతులు వాకా సితారామిరెడ్డి, పిన్నెల్లి శ్రీ ను, కురుగుంట్ల నరసింహ రెడ్డి, కురుగుంట్ల అప్పిరెడ్డి.మందడపు ప్రభాకర్ రెడ్డి.మందడపు రామకృష్ణ రెడ్డి,ముందడపు బ్రహ్మ రెడ్డి,గాదే నర్సయ్య,శేట్టీ మోహన్ రావు.పోతురాజు ఉపేంద్ర, ఓర్స నవీన్,మేడరపువేంకటేళ్వర్లు మరియు రామకృష్ణాపురం, ధ్వంసాలాపురం, చింతకాని, బోనకల్, మదిర, ముదిగోండ మండలలొ ప్రజలు పాల్గొన్నారు.