కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఏలేటి సాయి ప్రశాంత్(28) అనే యువకుడు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.
ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన సాయి ప్రశాంత్
తొర్లికొండ నుండి కారులో ఆర్మూర్ వెళ్తుండగా బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాయి ప్రశాంత్ తలకు బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవఖానకు తరలించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.