ManaEnadu:వినాయక చవితి (Ganesh Chaturthi) పండుగ సీజన్ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఆఫర్ల పండగకు తెరలేపింది. ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ (Flipkart’s Big Billion Days Sale 2024) తేదీలను తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగా (సెప్టెంబర్ 26వ తేదీ) నుంచే ఈ సేల్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ కార్డులపై భారీ డిస్కౌంట్లు..
బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు (HDFC Credit Card), డెబిట్ కార్డుదారులకు భారీ డిస్కౌంట్ అందిచనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా డిస్కౌంట్ ఉంటుందని.. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ ఉంటాయని ప్రకటించింది. ఇక ప్లిప్‌కార్ట్ పే లేటర్ (Flipkart Pay Letter) ద్వారా లక్ష వరకు రుణ సదుపాయం పొందొచ్చని వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్స్ అదుర్స్..
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ల (Smart Phone)పై డిస్కౌంట్లు ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనుండగా.. ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉంటుందనేది మాత్రం త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఇక యాపిల్ 16 సిరీస్ లాంచ్ (iPhone 16) అయిన వేళ.. పాత ఐఫోన్ మోడళ్ల ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీటిపైన భారీ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.
మరోవైపు స్మార్ట్ ఫోన్లతో పాటు టీవీలు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, గృహోపకరణాలపైనా ఆఫర్లు ఉండనున్నాయి. ఈ సేల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున సీజనల్ ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ రిక్రూట్ చేసుకుంటోంది. ఈ సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని సమాచారం. మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon Big Billion Days Sale) కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ పండుగ వేళ కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ రెండు ఇ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా సేల్ ప్రకటిస్తున్నాయన్నమాట.