Mana Enadu:బంగ్లాదేశ్(Bangladesh)లో గత 4 రోజులుగా నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చాయి. ఆందోళనకారులు చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు పట్టుబట్టడంతో షేక్ హసీనా(Sheikh Hasina) ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్(india)లో తలదాచుకుంటున్నారు.
అయినా బంగ్లాదేశ్లో ఆందోళనలు ఆగడం లేదు. తాజాగా వారు ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ముష్రఫీ మోర్తజా(Mashrafe Mortaza) ఇంటికి నిప్పుపెట్టారు. దీనికి కారణం లేకపోలేదు. మోర్తజా కూడా హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఎంపీ కావడమే. ప్రస్తుతం ఆయన ఖుల్నా డివిజన్లోని నరైల్-2 నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. మోర్తజా ఈ ఏడాది ప్రారంభంలోనే అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా తిరిగి ఎన్నికయ్యారు.

117 అంతర్జాతీయ మ్యాచ్లకు కెప్టెన్సీ మోర్తజా బంగ్లాదేశ్ తరఫున తన క్రికెట్ కెరీర్లో 117 అంతర్జాతీయ మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించారు. బంబంగ్లా తరఫున 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 390 వికెట్లు, 2,955 పరుగులు సాధించారు. 2018లో రాజకీయాలలోకి అరంగేట్రం చేశారు. అదే ఏడాది అవామీ లీగ్ పార్టీలో చేరి, ఎంపీగా గెలిచారు.