Pew Research: ‘Gen-Z’ జనరేషన్ వారు ఎక్కువగా ఏ యాప్స్ వాడుతున్నారో తెలుసా?

ManaEnadu: సోషల్ మీడియా(Social Media) మన నిత్య జీవితంలో ఒక అత్యవసరంగా మారింది. ప్రపంచం(World)లో ఏ మూల ఏం జరుగుతున్నా వివిధ అంశాలను, విషయాలను మనకళ్ల ముందుకు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇది యువతను ప్రభావితం చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్స్(Platforms) మన కమ్యూనికేషన్, అభిప్రాయాన్ని తెలియజేయడానికి, సమాచారం ప్రతి ఒక్కరికీ చేరవేయడంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్ మీడియా అంటే ఒక శక్తిమంతమైన సాధనం. అయితే ఇవి మనకు ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ.. అంతే స్థాయిలో సవాళ్లను కూడా సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రోజువారీ జీవితంపై దీని ప్రభావం భారీగానే ఉంటోంది. మానసిక ఆందోళన, డిప్రెషన్(Depression), సైబర్ మోసాలు(Cyber Crime), ఆన్ లైన్ వేధింపులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలానే అంశాలు ఉంటాయి. అయితే సోషల్ మీడియాను అవసరానికి మాత్రమే వాడుకుంటే ఏం ఇబ్బంది లేదు. కానీ వాడకం వ్యసనంగా మారితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అయితే ఇటీవల ప్యూరీసెర్చ్ సెంటర్(Pew Research Center) Gen-Z తరంవారు ఎక్కువ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాడుతున్నారనేదానిపై ఓ సర్వే(Survey) నిర్వహించింది. ఇంతకీ ఆ సర్వేలో ఏంతేలిందో తెలుసుకుందామా..

 “Gen Z” రీసెర్చ్ ఏం చెబుతోందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, వారు అంగీకరించని సమస్యలపై నిరసనలను నమోదు చేయడానికి తోడ్పడుతోంది. అలాగే ఉద్యోగాల(Jobs) కోసం శోధించడానికి, ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి, బ్రాండ్‌(Brands)లను ప్రోత్సహించడానికి, వార్తలను చూడటానికి ఉపయోగపడుతోంది. దీంతోపాటు విద్యా అవకాశాలను కొనసాగించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. చాలా మంది తమ పోస్ట్‌లు పొందే ట్రాక్షన్ ఆధారంగా గణనీయమైన డబ్బునూ సంపాదిస్తున్నారు. సాధారణంగా “Gen Z” అనే పదాన్ని సాధారణంగా 1990ల చివరి నుంచి 2010ల ప్రారంభం వరకు జన్మించిన జనాభా సమూహాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. 2023లో విడుదలైన ప్యూ రీసెర్చ్ సెంటర్(Pew Research Center) డేటా ప్రకారం, Gen Z కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో YouTube అగ్రస్థానంలో ఉంది, Instagram, Facebook, Snapchat, TikTok, Pinterest, Reddit, X (గతంలో Twitter), LinkedIn, WhatsApp, BeReal వంటి పలు యాప్స్‌పై సర్వే నిర్వహించింది. ఇందులో ఎక్కువ మంది వేటిని వీక్షిస్తున్నారో తెలుసుకుందామా..

 ఎక్కువ మంది చూస్తుంది వీటినే..
YouTube: 93%
ఇన్‌స్టాగ్రామ్: 78%
Facebook: 67%
స్నాప్‌చాట్: 65%
టిక్‌టాక్: 62%
Pinterest: 45%
రెడ్డిట్: 44%
X / Twitter: 42%
లింక్డ్ఇన్: 32%
WhatsApp: 32%
బీరియల్: 12%

Related Posts

Stocks: ఎంపిక చేసుకున్న షేర్లలోనే ట్రేడింగ్ కీలకం!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న…

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వెల్‌కమ్ చెప్పిన రోబో.. వీడియో చూశారా?

ఏపీ మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్(Mayuri Tech Park) ప్రాంగణంలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌(Ratan Tata Innovation Hub)’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఓ రోబో(Robo) నమస్కరించి స్వాగతం పలికిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *