Mana Enadu: మనదేశంలో ముఖ్యమైన ఐడెంటెటీ(Identities)ల్లో ఒకటి పాన్ కార్డు( PAN card). ఇది ఇతర గుర్తింపు కార్డుల్లా కాకుండా అందరికీ ఒకటే ఉంటుంది. అయితే కొందరు అతి తెలివి ఉపయోగించి రెండు పాన్ కార్డులను కూడా తీసుకుంటారు. ఇలాంటి వారికి ఐటీశాఖ(Income Tax Department) షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఒకరికి ఒక పాన్ కార్డు కంటే ఎక్కువ ఉంటే రూ.10వేల వరకూ జరిమానా విధిస్తామని ప్రకటించింది. అందుకే అలాంటి వారు ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా ఇంకో పాన్ కార్డును క్యాన్సిల్(Cancle) చేసుకోవాలని సూచించింది. ఇందుకు ప్రత్యేక తేదీ అంటూ ఏమీ లేదని తెలిపింది.
ఐటీ శాఖ ఇచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు
మన దేశంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనవి. పాన్ కార్డ్ అనేది వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ప్రత్యేకమైన 10-అంకెల గుర్తింపు సంఖ్య కార్డు. ఇది గుర్తింపు రుజువుగా కూడా పనిచేస్తుంది. బ్యాంక్ ఖాతాలు(Bank accounts) తెరవడం, రుణాల(Loans) కోసం దరఖాస్తు చేయడంతోపాటు మన దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్(Income Tax) కట్టాలంటే పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఐటీ శాఖ నియమాలు, నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం నిషేధం. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇది చట్టపరమైన పరిణామాలు, జరిమానాలకు దారి తీస్తుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉన్నట్లు తేలితే, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 272B ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ సెక్షన్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తికి రూ.10వేల జరిమానా (Fine) విధించవచ్చు.
రెండు కార్డులుంటే వెంటనే తిరిగిచ్చేయండి
మీరు బహుశా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే వాటిని అందజేయడం వలన మీరు చట్టబద్ధంగా(Legally) సరైన విధానాన్ని అనుసరించినట్టుగా అవుతారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండు పాన్లు మోసపూరిత ప్రయోజనాల(Fraudulent benefits) కోసం మాత్రమే తీసుకుంటారని దీని అర్థం కాదు. కొన్నిసార్లు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, చాలా కాలం తర్వాత కూడా పాన్ కార్డు అందదు. దీంతో మరోసారి అప్లై(Apply) చేస్తారు. కొంతమందికి మరొక పాన్ కార్డు వస్తుంది. అదే విధంగా తమ వద్ద ఉన్న పాన్ కార్డుల్లో ఏదైనా తప్పులుంటే(Mistakes) వాటిని మార్చుకోకుండా మరో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. అటువంటి సమయంలో 2 పాన్ కార్డులు ఉండవచ్చు. ఒకదానిని అప్పగించడం వలన మీకు జరిమానాలు పడవు. సో అందుకే ఇలా రెండు పాన్ కార్డులున్నవారు వెంటనే ఐటీశాఖకు తిరిగి ఇచ్చేయడం మంచింది.






