GHMC| గ్రేటర్​ బీఆర్​ఎస్​కు మరోషాక్​..కాంగ్రెస్​లోకి మేయర్​

గ్రేటర్​ బీఆర్​ఎస్ మరో షాక్​ తగిలింది. జీహెచ్ఎంసీపై కాంగ్రెస్​ దృష్టి సారించింది. ఈక్రమంలోనే మేయర్​ (Mayor))గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్​లో చేరికకు రంగం సిద్దం అయింది.

జీహెచ్​ఎంసీ(GHMC) మేయర్​ గద్వాల విజయలక్ష్మి శుక్రవారం కాంగ్రెస్​ ఇంఛార్జీ దీపాదాస్​తో బేటి అయ్యారు. రేపటిలోగా కార్యకర్తల నిర్ణయం తీసుకుని స్పష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రేటర్​ డిప్యూటీ మేయర్​తోపాటు, మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ మరో పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్​ గూటికి వెళ్లారు.

హైదరాబాద్​లో హస్తం పార్టీ బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్​ Congress)(పార్టీ నాయకులు దూకుడు పెంచారు. ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి మల్కాజ్​గిరితోపాటు చేవేళ్ల పార్లమెంట్​ నియోజకవర్గాలపై దృష్టి సారించారు.

మేయర్​ విజయలక్ష్మితోపాటు మరో 20మంది కార్పొరేటర్లు ఆమెతోపాటు బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరికకు ముహుర్తం ఖరారు అయిందని సమాచారం. ఇప్పటికే ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ కాంగ్రెస్​లో చేరడంతోపాటు సికింద్రాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్​ హైదరాబాద్​లో హస్తం బలం పెంచుకునే దిశగా సీఎం రేవంత్​రెడ్డి (CM Reventh Reddy)ఆధ్వర్యంలో భారీ చేరికలు ఉండబోతున్నాయని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు.

ఈవిషయంపై మేయర్​ గద్వాల విజయలక్ష్మి మాత్రం కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వనించారు. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

Share post:

లేటెస్ట్