రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలు దిశగా కార్యచరణ కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు త్వరలో నెలకు రూ. 2500 ఇస్తామని పేర్కొన్నారు.
Minister Ponguleti on New Ration Cards Issuing : రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti) పేర్కొన్నారు. గత ప్రభుత్వం మరిచిపోయిన కొత్త రేషన్‌కార్డుల జారీని త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో జరిగిన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేస్తామని ప్రకటించారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ “మీ అందరి దీవెనలతో శాసన సభ్యుడినయ్యాను. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, అది మీరు పెట్టిన భిక్షే. గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని అవమానాలు ఎదురైనా, వాటిని నిలదొక్కుకుని రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చారు. పదవులు, అధికారం శాశ్వతం కాదు మీ శీనన్నగా మీగుండెల్లో ఉంటాను అని” మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో కొత్త రేషన్‌కార్డులను ఇవ్వలేదు, వాటి ఊసే మరిచిపోయిందని మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ, త్వరలో రేషన్‌కార్డులను జారీ చేస్తామని స్పష్టం(New Ration Cards Issuing) చేశారు. అప్పటి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని ప్రజలకు ఆశ కల్పించారు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల సంఖ్య మొత్తం కలిపి వందల్లో ఉందని మండిపడ్డారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ డబుల్‌బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు.మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటిఇప్పటికే రాష్ట్రప్రభుత్వం పలు గ్యారంటీలను ప్రారభించింది. మొదటగా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు ఇస్తున్నాము. నిన్న సచివాలయంలో మరో రెండు గ్యారంటీలను ప్రారంభించాము. తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్లను అందిస్తామని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి చేపట్టి వేలాది ఎకరాలను స్వాహా చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. భూసమస్యలకు సంబంధించిన 2,45,000 అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వాటన్నింటిని 10-15 రోజుల్లోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ నిరుపయోగంగా మారాయని ప్రజాధనాన్ని పెద్దమొత్తంలో దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…