Happy Independence Day-2024:వందేమాతరం.. భారతీయతే మా నినాదం

Mana Enadu: ప్రపంచంలో ఒక్కోదేశానిది ఒక్కో ప్రత్యేకత. ముఖ్యంగా భారత దేశాని(India)కి ఇతర దేశాలకు చాలా తేడాలుంటాయి. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అత్యధిక జనాభా ఉన్న దేశం. భౌగోళికంగానూ మనది 7వ పెద్ద దేశం. అంతేకాదండోయ్.. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశానికీ అత్యంత విలువైన సంపద సంపద కేవలం మన దేశంలోనే ఉంది. అదేంటి అనుకుంటున్నారా? యువత. ప్రస్తుతం యువత అధికంగా ఉన్న దేశాల్లో మనమే టాప్. ఐటీ, ఫార్మసీ సహా ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న దేశం.

స్వాతంత్ర్య సమరయోధులు.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి.. మనకు స్వాతంత్య్రం ఇచ్చారు. ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే.. దానికి కారణం వారి దిశా నిర్దేశమే.. నాటి అమరుల త్యాగలను గుర్తు చేసుకుంటూ.. 77 వసంతాలు పూర్తై.. 78వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సమరయోధులకు సెల్యూట్, జాతీయ జెండాకు వందనం చేస్తూ శుభాకాంక్షలు(Happy Independence Day) తెలుపుకుందాం.

 ప్రముఖుల మాటల్లో

స్వాతంత్ర్య సమర ఉద్యమ సమయంలో మన నేతలు, నాయకులు, పెద్దలు ఎన్నో సూక్తులు తెలిపారు. అవి యువతలో ఉత్సాహం తెచ్చాయి. అందర్నీ స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించాయి. వాటిలో కొన్నింటిని గుర్తు చేసుకుందాం..

☛ అన్యాయం, తప్పుతో రాజీపడటం అత్యంత ఘోరమైన నేరమని మర్చిపోకండి. శాశ్వతమైన చట్టాన్ని గుర్తుంచుకోండి. మీరు పొందాలనుకుంటే తప్పక పోరాడాలి – సుభాష్ చంద్రబోస్

☛ నాకు రక్తాన్ని ఇవ్వండి.. మీకు నేను స్వాతంత్ర్యం ఇస్తాను – స్వామి దయానంద సరస్వతి

☛ సత్యం, అహింస నాకు దేవుళ్లు – మహాత్మా గాంధీ

☛ నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి – సర్దార్ వల్లభాయ్ పటేల్

☛ ఒకే దేశం, ఒకే దేవుడు,ఒకే కులం,ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం – వీడీ సావర్కర్

☛ బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు – మౌలానా అబుల్ కలాం ఆజాద్

☛ స్వాతంత్ర్యం అనేది ఓ కనిపించని మహా అదృష్టం. అది లేనప్పుడు గానీ దాని విలువ తెలియదు – రవీంద్రనాథ్ ఠాగూర్

☛ భారత దేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లలాంటివారు – సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

☛ ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం – జవహర్ లాల్ నెహ్రూ

☛ ఇంక్విలాబ్ జిందాబాద్ – భగత్ సింగ్

☛ మీరు సామాజిక స్వేచ్ఛను సాధించనంత కాలం, చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా మీకు ప్రయోజనం ఉండదు. – బీఆర్ అంబేడ్కర్

☛ ఒక దేశం గొప్పతనం.. ఆ జాతి తల్లులకు స్ఫూర్తినిచ్చే ప్రేమ, త్యాగం యొక్క శాశ్వతమైన ఆదర్శంలో ఉంది. – సరోజినీ నాయుడు

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *