Mana Enadu:ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. షాప్‌లకు వెళ్లినా, రెస్టారెంట్లు, షాపింగ్స్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆన్‌లోనే చెల్లించేస్తున్నారు. మొత్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. నగదును క్యారీ చేయడం మొత్తానికి తగ్గింది. అయితే మీకో ఇంపార్టెంట్ న్యూస్… మీరూ కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తుంటే.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే యూపీఐ చెల్లింపులు ఆగస్టు 4న పని చేయవు. వాస్తవానికి ఇది HDFC బ్యాంకు వినియోగదారులకు మాత్రమే. ఎందుకంటే బ్యాంకు ద్వారా డౌన్ టైమ్ అలర్ట్ జారీ చేశారు. ఈ వ్యవధిలో, ఏలాంటి ఆన్లైన్ చెల్లింపులు అయినా నిలిపోనున్నాయి. అంతేకాదు దీనికి టైమ్ కూడా నిర్ణయించారు.

అంతరాయం ఎంతసేపంటే..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 4న అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు సిస్టమ్ నిర్వహణ పనులు జరుగుతాయని తెలిపింది. అంటే మొత్తం 180 నిమిషాల పాటు యూపీఐ సేవలు నిలిచిపోతాయి. ఇది ఖాతాదారులపై ప్రభావం చూపనుంది.
ఈ యాప్స్‌పై ప్రభావం
దీని ద్వారా అన్ని యాప్‌లు ప్రభావితం కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్ పే, వాట్సాప్ పే, పేటీఎం, మొబిక్విక్, వంటి వాటిల్లో పేమెంట్స్ చేయలేరు. కానీ పీఓఎస్ సాయంతో చేసే లావాదేవీలపై ఎలాంటి ప్రభావమూ ఉండదట. అందకే ఆలోపే మీరు మీ చెల్లింపులను పూర్తి చేసుకోవడం బెటర్.






