ManaEnadu:ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివారు.. ఫోన్లో వాట్సాప్‌లోని వారంటూ లేరు. వాట్సాప్ (WhatsApp) మన నిత్యజీవితంలో భాగమైపోయింది. సులువుగా సందేశాలు పంపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ టాప్‌లో ఉందంటే దీనికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
ఇక వాట్సాప్ తన కస్టమర్ల కోసం తరచూ కొత్త కొత్త ఫీచర్స్ (WhatsApp New Feature) అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. తాజాగా వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్లో మనం వాయిస్ మెసేజ్‌ను టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా టైప్ చేయడం కంటే వాయిస్ మెసేజ్ (WhatsApp Voice Message)లే మేలని చాలా మంది భావిస్తుంటారు. కానీ అన్నిసార్లు మనం వాయిస్ మెసేజ్‌లు వినే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. అందుకోసమే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వాయిస్ మెసేజ్‌ను ఇంగ్లీష్, హిందీ, పోర్చుగీసు, స్పానిష్, రష్యన్ భాషల్లోకి టెక్స్ట్‌ను ట్రాన్స్‌స్క్రిప్ట్ చేయగలదు.
ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవడం ఎలాగంటే?
వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి చాట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
అక్కడ ట్రాన్‌స్క్రిప్షన్ ఆఫ్/ ఆన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
ఆన్ చేస్తే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
యాక్టివేట్ చేసిన తర్వాత వాయిస్ నోట్స్‌ను టెక్ట్స్ రూపంలోకి మార్చడానికి ఓ ఆప్షన్ కనిపిస్తుంది.
వాయిస్ నోట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత మీ చాట్స్‌లో వాయిస్ మెసెజెస్ టెక్ట్స్ రూపంలోకి మారిపోతుంది.
ఇలా సింపుల్ ప్రాసెస్‌లో వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు వాయిస్ మెసెజెస్‌ను వినకుండానే వాటిని సులభంగా చదవవచ్చు, ఇంకా రిప్లై కూడా ఇవ్వొచ్చు.