గూగుల్ డ్రైవ్ ఫుల్ అయిందా?.. ఈజీగా క్లీన్ చేసుకోండిలా!

ManaEnadu:మీ మొబైల్ లో ఫొటోలు లేదా డాక్యుమెంట్లు స్టోర్ చేద్దామనుకుంటే డ్రైవ్ (Google Storage) ఫుల్ అయినట్లు అలర్ట్ వస్తోందా.. అదనపు ఛార్జీలు కట్టి స్టోరేజీ తీసుకోవాలనుకుంటున్నారా.. అలా చేయకుండా సింపుల్ గా కొన్ని టిప్స్ పాటిస్తే సరి మీ స్టోరేజ్ ను సులభంగా క్లీన్ చేసుకుని.. ఎలాంటి నగదు చెల్లించకుండా మీకు సంబంధించిన సమాచారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. పెయిడ్ స్టోరేజ్ ప్లాన్‌ (Paid Google Storage)కి అప్‌గ్రేడ్ అవ్వ‌కుండా మీ కోసం ఈ సింపుల్ డిజిట‌ల్ క్లీనింగ్ టిప్స్​.. 

అనవసర డేటా తొలగించండి..

గూగుల్‌ స్టోరేజీని క్లీనప్‌ చేయడానికి గూగుల్‌ డ్రైవ్‌ (Google Drive), గూగుల్‌ ఫొటోస్‌, జీమెయిల్‌ లో ఉన్న అనవసర డేటాను తొలగించాలి. ముందుగా గూగుల్‌ వన్‌ స్టోరేజీ మేనేజర్‌కి వెళ్తే దేనికంత స్టోరేజీ అవుతోందో కనిపిస్తుంది. ఇక  ఏయే సర్వీసుల్లో పెద్ద ఫైల్స్‌ ఉన్నాయో చూసుకుని ఆ సర్వీసులనుపై క్లిక్‌ చేస్తే డిలీట్‌ చేయాల్సిన ఫైల్స్ కనిపిస్తాయి. వాటిని ఇలా ఈజీగా డిలీట్ చేసేయొచ్చు.

గూగుల్ ఫొటోస్

ఇక గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజీలో ఎక్కువ భాగం ఆక్రమించే వాటిలో మొదటిది గూగుల్‌ ఫొటోస్‌ (Google Photos). ఇందులో  అవసరం లేని వీడియోలు, ఫొటోలు తొలగిస్తే ఎక్కువ ఫ్రీ స్పేస్‌ను పొందొచ్చు.  డూప్లికేట్‌ ఇమేజ్‌లను డిలీట్‌ చేయడం ద్వారా స్టోరేజీ పెరుగుతుంది.

గూగుల్ డ్రైవ్

మనకు అవసరమైన పీడీఎఫ్‌లు, ముఖ్యమైన ఇతర డాక్యుమెంట్లు ఉంటే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని భద్రపరుచుకుని డ్రైవ్‌ నుంచి తొలగించుకుంటే స్టోరేజ్ సేవ్ అవుతుంది. వాటిని తొలగించాలంటే.. size:larger:5M అని సెర్చ్‌ చేస్తే 5 ఎంబీ కంటే ఎక్కువ సైజున్న ఫైల్స్‌ను తొలగించుకోవచ్చు. 

అన్ రీడ్ మెయిల్స్ ..

ప్రమోషనల్‌ మెయిల్స్‌ తో మన జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌ (G-Mail Inbox) నిండిపోతుంది. ఈ మెయిల్స్‌ను తొలగిస్తే చాలా స్పేస్ సేవ్ అవుతుంది.  ఇందుకోసం జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌లో చెక్‌బాక్స్‌ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్‌ మెనూపై క్లిక్‌ చేసి అన్‌రీడ్‌ ఆప్షన్ సెలెక్ట్‌ చేసి  చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేసి డిలీట్‌ క్లిక్‌ చేస్తే అన్నిీ డిలీట్‌ అయిపోతాయి.

లార్జ్ ఈ-మెయిల్స్

మనం పంపించే లేదా మనకొచ్చే మెయిల్స్ లో పెద్దగా ఉన్న మెయిల్స్ ను తొలగించడం వల్ల  ఎక్కువ స్పేస్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం సెర్చ్‌బార్లో has:attachment larger: 5M అని సెర్చ్‌ చేసి 5 ఎంబీ కంటే ఎక్కువ సైజ్‌ ఉన్న మెయిల్స్‌ను తొలగించండి.

అనవసరమైన ఫైళ్లన్నీ తొలగించినా ఇంకా స్టోరేజీ సరిపోకపోతే.. లార్జ్‌ ఫైల్స్‌ను డెస్క్‌టాప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని గూగుల్‌ స్టోరేజీలో డిలీట్‌ చేసి ఒకే తరహా ఫైల్స్‌ (వీడియోలు, పీడీఎఫ్‌లు) ZIP, RARను ఉపయోగించి కంప్రెస్‌ చేసి అప్‌లోడ్‌ చేయండి. దీనివల్ల స్పేస్ తగ్గుతుంది.

Share post:

లేటెస్ట్