ManaEnadu:ఆధార్ .. ప్రస్తుతం భారత్ లో ప్రతి పనికి అవసరమయ్యే డాక్యుమెంట్లలో ముఖ్యమైనది. రోజు వారీ జీవితంలో ఆధార్ కార్డ్ భాగమైపోయింది. ప్రతి పనిలో కీలకంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డ్ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా మొబైల్ నంబర్ లింక్ చేస్తారు. ఏళ్ల క్రితం లింక్ చేసిన మొబైల్ నంబర్.. ఆ తర్వాత కాలంలో వివిధ కారణాలతో మార్చేసుంటారు. కొంతమంది ఆ సమయంలో మొబైల్ నంబర్ లేక వేరే వాళ్ల నంబర్ లింక్ చూసి ఆ తర్వాత కాలంలో తమకంటూ ఓ ఫోన్ తీసుకుని కొత్త నంబర్ తీసుకున్న వాళ్లూ ఉన్నారు.
అయితే ఇలాంటి సమయంలో ఆధార్ కార్డుకు లింక్ చేసిన ఫోన్ నెంబర్ ఏదో తెలుసుకోవాలంటే ఎలా.. ప్రస్తుతం ప్రతి దానికి ఆధార్ అవసరం అవుతోంది. అలాగే ఓటీపీ కూడా ముఖ్యమవుతోంది. ఇలాంటి సమయంలో ఆధార్ కు లింక్ చేసిన ఫోన్ నంబర్ తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఉడాయ్ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తోఏ నంబర్‌కు మీ ఆధార్- లింక్డ్ మొబైల్ నంబర్ తెలుసుకోవచ్చు. మరి ఎలా తెలుసుకోవాలంటే..
ఆధార్ కు ఏ ఫోన్ నంబర్ లింక్ అయిందో ఇలా తెలుసుకోండి
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
‘My Aadhaar’ వెబ్‌సైట్‌కు వెళ్లాలి
అక్కడ ‘Aadhaar Services’ని సెలక్ట్ చేయాలి
ఆ తర్వాత ‘Verify Email/Mobile Number’పై క్లిక్ చేయండి.
ఇక్కడ మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేసి ‘Enter’ నొక్కండి.
మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటే నంబర్ లింక్ అయినట్లు సందేశం వస్తుంది.
ఒక వేళ కాకపోతే లింక్ కాలేదని డిస్ ప్లై అవుతుంది. అప్పుడు మీ వద్ద ఉన్న మొబైల్ నంబర్‌లో ఏ దానికి ఆధార్ కార్డ్‌కి లింక్ అయి ఉందో తెలుసుకోవచ్చు.