Aadhaar Update: సమయం దగ్గర పడుతోంది.. త్వరగా అప్డేట్ చేసుకోండి

Mana Enadu: ఆధార్ కార్డు.. దేశంలో పత్రి పనికీ ఈ కార్డు తప్పనిసరి. ఎక్కడికి వెళ్లాలన్నా.. ప్రభుత్వం అందించే ఏ స్కీము పొందాలన్నా ఆధార్ మస్ట్‌గా ఉండాల్సిందే. ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా, బ్యాంకు, హాస్పిటల్, స్కూల్, కాలేజీ అడ్మిషన్లు ఇలా ప్రతి విషయానికీ ఆధార్ కార్డు అడుగుతున్నారు. అంతేకాదండోయ్.. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మహిళల కోసం ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకానికీ ఈ కార్డు ఉండాల్సిందే. ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాలకు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాల్సిందే. ఒకవేళ లేకపోతే మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేరు. అందుకే ఆధార్​లో పేరు, అడ్రస్, ఫొటో, మొబైల్ నంబర్, పుట్టినరోజు వంటి వివరాలు సరిగ్గా ఉండాలి.

పదేళ్లకోసారి చేసుకోవాల్సిందే..

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, రెన్యూవల్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం ఆధార్ కార్డు చేయించుకున్నప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి అడ్రస్, ప్రూప్స్​ డాక్యుమెంట్స్​ను అప్​డేట్​ చేసుకోవాలి. లేకుంటే చాలా ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఉచితంగా ఆధార్ అప్​డేట్​ చేసుకునేందుకు UIDAI ఇప్పటికే గడువు ముగియగా పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. ప్రస్తుతం సెప్టెంబర్ 14 లోపు ఫ్రీగా ఆధార్ అప్​డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. లేకుంటే ఇంతకు ముందులాగానే ఆధార్ సెంటర్​లో రూ.50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 ఆధార్ అప్డేట్ ప్రాసెస్ ఇలా..

☛ ఆధార్ కార్డును అప్​డేట్ చేసేందుకు https://myaadhaar.uidai.gov.in/portal పోర్టల్లోకి వెళ్లండి.
☛ ఆధార్ నంబర్‌ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘సెండ్ OTP’ ఆప్షన్​పై క్లిక్ చేయండి.
☛ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు OTP వెళ్తుంది. అది నమోదు చేసి, ఎంటర్ ఆప్షన్​పై క్లిక్ చేయండి.
☛ అక్కడ సర్వీసెస్​లో డాక్యుమెంట్ అప్​డేట్​పై క్లిక్ చేయండి. స్క్రీన్​పై మీ పేరు, జెండర్, డేట్​ ఆఫ్​ బర్త్​, అడ్రస్ వంటి వివరాలు కన్పిస్తాయి. వాటిలో మీరు ఏం అప్​డేట్​ చేయాలి అనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి.
☛ ఐడీ, అడ్రస్ ప్రూఫ్​ కోసం కొన్ని డాక్యుమెంట్లను అడుగుతుంది. అవసరమైన డాక్యుమెంట్ 2MB కంటే తక్కువ సైజ్ ఉండాలి.
☛ ఆయా డాక్యుమెంట్స్ స్కాన్డ్ కాపీల్ని అప్లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
☛ తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీంతో అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్​డేట్​ చేసిన ఏడు రోజుల తర్వాత కొత్త ఆధార్ కార్డును మనం పొందొచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *