బంగారం తాకట్టు పెట్టుకుని లోన్స్ ఇచ్చే సంస్థలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. తక్కువ వడ్డీకే పెద్ద మొత్తంలో గోల్డ్ లోన్స్ ఇస్తున్నామని వినియోగదారులకు ఫోన్లు చేసి మరి ఆఫర్లు వివరిస్తున్నారు. వీటితోపాటు బంగారం రేట్ రోజురోజుకి పెరుగుతుండటంంతో తనాఖాపై సోమ్ము కూడా అధికంగానే వస్తుంది.
మరో గోల్డ్‌లోన్(Gold Loans) సంస్థలో ఉన్న బంగారంపై అప్పు మా సంస్థ కట్టి మీ బంగారాన్ని మా దగ్గర గోల్డ్ లోన్ తీసుకోవడంతో అధిక సోమ్ము ఇచ్చే సంస్థలు మధ్య పోటీ ఎక్కువ అయింది. ఇదే అదనగా తీసుకున్న ఓ జంట హైదరాబాద్‌లో (Hyderabad)గోల్డ్ లోన్ సంస్థలకు రూ.50లక్షల వరకు టోకరా వేసినట్లు పోలీసులు విచారణలో ప్రాథమికంగా గుర్తించిన ఘటన చోటు చేసుకుంది.
మల్కాజిగిరి (Malkajgiri)సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. దాసరి రజనీ, శ్యామ్ దంపతులు ఆనంద్‌బాగ్‌లోని కేఎల్‌ఎం ఆక్సీనా ఫైనాన్స్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న లావణ్యను కలిశారు. తమ 382 గ్రా బంగారాన్ని ఓరా ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నామని.. మీరు రుణం ఇస్తే అక్కడ చెల్లించి బంగారం మీ వద్ద తాకట్టు పెడతామని నమ్మించారు.
పాత రసీదు చూపించారు. దీంతో కేఎల్‌ఎం సంస్థ ఈనెల 16న రూ.14,85,551 రుణం ఇచ్చింది. 3 రోజులయినా రాకపోవడంతో కేఎల్‌ఎం ఆక్సీనా ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ శ్రీసిద్ధంషీటీ మంగళవారం రాత్రి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతులపై కీసర, కుషాయిగూడ స్టేషన్లలోనూ ఇలాంటి కేసులే నమోదై ఉన్నట్లు తెలుస్తోంది.