Team India Practice: ప్రాక్టీస్ షురూ.. టెస్ట్ సిరీస్‌కు టీమ్ఇండియా కొత్త ప్లాన్!

ManaEnadu: చాలా రోజుల తర్వాత టీమ్ఇండియా(Team India) మైదానంలోకి అడుగు పెట్టింది. బంగ్లాదేశ్‍(Bangladesh)తో తొలి టెస్టుకు భారత ప్లేయర్లు ప్రాక్టీస్(Practice) షురూ చేశారు. అయితే నయా కోచ్ గంభీర్ నేతృత్వంలో ఈ టెస్టు సిరీస్ కోసం రోహిత్(Rohit sharma) సేన ఓ వ్యూహం అమలు చేయనుంది. ఆస్ట్రేలియా(Australia) సిరీస్‍కు కూడా ఇది ఉపయోగపడుతుందనే ఆలోచనలో టీమ్ఇండియా భావిస్తోంది. తొలి టెస్టు జరిగే చెన్నైలోని చెపాక్ MA చిదంబరం స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. SEP 17న ఈ గ్రౌండ్‌లో భారత్, బంగ్లా తొలి టెస్టు మొదలుకానుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్‍పై తొలిసారి సిరీస్ గెలిచి ఊపు మీదుంది. కాగా, ఈ తొలి టెస్టులో బంగ్లాను దెబ్బకొట్టేందుకు పిచ్(Pitch) విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Goutam Gambhir) ఓ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రెండు సిరీస్‌లకూ ఉపయోగపడేలా..

బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు కోసం చెపాక్ స్టేడియం పిచ్‍ తయారీలో రెడ్ సాయిల్ (Red Soil))ని ఎక్కువగా వినియోగించేలా టీమ్ఇండియా నిర్ణయించిందని తెలుస్తోంది. సాధారణంగా ఆ స్టేడియంలో నల్లమట్టిని వాడుతున్నా.. ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్‍ వైపే Team India మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. స్పిన్‍(Spin) అనుకూలించే పిచ్‍పై బంగ్లాదేశ్ ఇటీవల రాణిస్తోంది. ఆ జట్టు స్పిన్ విభాగంలోనూ బలంగా కనిపిస్తోంది. తమ దేశంలో బంగ్లాదేశ్‍లో ఎక్కువగా నల్లమట్టి పిచ్‍లపైనే అడుతుంది. అందుకే రెడ్ సాయిల్ పిచ్ అయితే బంగ్లాదేశ్ తిప్పలు పడకతప్పదని భారత మేనేజ్‍మెంట్ భావిస్తోంది. రెడ్ సాయిల్ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్ బాగా లభిస్తుంది. ఎక్కువగా ఆస్ట్రేలియా పిచ్‍ల్లాగా ఉంది. ఇలా అయితే భారత పేసర్లను ఎదుర్కొవడం బంగ్లాదేశ్ బ్యాటర్ల(Batters)కు కష్టంగా మారుతుంది. స్పిన్‍తో పోలిస్తే బంగ్లా పేస్ విభాగం కాస్త బలహీనంగానే ఉంది. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తొలి టెస్టుకు ఎర్రమట్టి వికెట్‍నే ఇవ్వాలని భారత్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. బంగ్లాదేశ్‍తో రెడ్ సాయిల్ పిచ్‍లపై ఆడితే.. ఆస్ట్రేలియాతో ఈ ఏడాది చివర్లో తలపడే బోర్డర్ – గవాస్కర్(Boarder Gavskar Trophy) ట్రోఫీ టెస్టు సిరీస్‍కు కూడా సన్నాహకంగా ఉంటుందని భారత్ భావిస్తోంది. నవంబర్ 22 నుంచి 2025 జనవరి 3 మధ్య ఆసీస్‍ గడ్డపై జరిగే ఈ సిరీస్‍ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

తేలికగా తీసుకుంటే అంతే సంగతి

బంగ్లాదేశ్ గత నెలలో చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‍ను ఆ దేశ గడ్డపైనే బంగ్లా చిత్తు చేసింది. ఏకంగా 2-0తో సిరీస్‍ను క్లీన్ స్వీప్ చేసింది. పాక్‍పై బంగ్లాకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఫుల్ ఫామ్‍లో ఉన్న ఆ జట్టును టీమిండియాకు కూడా తేలికగా తీసుకోవడం లేదు. అందుకే పూర్తి సామర్థ్యంతోనే బరిలోకి దిగుతోంది. బంగ్లాతో తొలి టెస్టు జరిగే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి ప్రాక్టీస్ సెషన్‍లో విరాట్ కోహ్లీ(Virat Kohli) నెట్స్‌లో సుదీర్ఘంగా చెమటోడ్చాడు. భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్(Pant) కూడా ప్రాక్టీస్ చేశారు. ఇతర ఆటగాళ్లు కూడా సన్నాహకాలు చేశారు. కాగా భారత్, బంగ్లా మధ్య సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్టు జరగనుంది. సిరీస్‍లో ఆఖరిదైన రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా సాగనుంది. ఆ తర్వాత OCT 6 నుంచి 12 మధ్య ఇరు జట్లు మూడు T20లు ఆడతాయి.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *