ManaEnadu:పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునే వారికి బెస్ట్ ప్యాకేజీని తీసుకొచ్చింది. గంగా సరయూ దర్శన్ పేరిట ప్రకటించిన ఈ ట్రిప్ ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి ఆదివారం రైలు ఉండగా.. సెప్టెంబర్ 22 నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ట్రిప్ వివరాలు తెలుసుకుందామా..?
అయోధ్య, వారణాసి ట్రిప్ వివరాలు ఇవే..
Day -1 : ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్ (దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 12791) నుంచి యాత్ర షురూ అవుతుంది.
Day -2 : ఉదయం వారణాసి చేరుకుంటారు. ముందుగా బుక్ చేసిన హోటల్ చేరుకుని సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి దర్శనం ఉంటుంది.
Day -3 : ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్‌ల సందర్శన ఉంటుంది. అది పూర్తయ్యాక సాయంకాలం అలా జాలీగా షాపింగ్‌కు వెళ్లొచ్చు.
Day -4 : వారణాసి నుంచి అయోధ్య చేరుకుని హోటల్‌లో కాసేపు రెస్ట్ తీసుకుని అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహల్‌ను సందర్శిస్తారు. సాయంత్రం సరయు ఘాట్‌కు వెళ్లి రాత్రి బస చేసేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్తారు.
Day -5 : ఉదయం టిఫిన్ చేశాక సికింద్రాబాద్ (ట్రైన్ నం: 12792)కు బయల్దేరుతారు.
Day -6 : మరుసటి రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. ఇక్కడితో మీ యాత్ర పూర్తైపోతుంది.