Mana Enadu:ఇండియన్ ఆర్మీ(ndian army) NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సుకు నోటిఫికేషన్(notification) విడుదలైంది. దీనికి ఎంపికైతే షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో ఉద్యోగం పొందవచ్చు. లెఫ్ట్‌నెంట్ హోదాలో కెరీర్ ప్రారంభించి ఆర్మీలో విధులు నిర్వహించే అవకాశం లభిస్తుంది. NCC పురుష అభ్యర్థులకు 76, మహిళా అభ్యర్థులకు 6 పోస్టులు కేటాయించారు. NCC -సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్‌తో పాటు 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. డిగ్రీ(degree final year) చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2025 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కోర్సు ప్రవేశాలకు ఆగస్టు 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. వారికి మొదట SSB ఇంటర్వ్యూ చేస్తుంది. ఇది రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలు ఉంటాయి. ఇందులో ఎంపికైన వారికి మెడికల్ టెస్ట్(medical test), సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై(chennai)లో 49వారాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చెల్లిస్తాయి. శిక్షణ పూర్తి అయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ పొందవచ్చు.
రైల్వేలో 7,951 ఇంజినీర్ పోస్టులు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 7,951 జూనియర్ ఇంజినీర్ (జేఈ), DMS, CMA, కెమికల్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బీటెక్/బీఈ ఉత్తీర్ణులైనవారు జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపు కలదు. జనరల్/OBC/ EWS అభ్యర్థులు రూ. 500, SC/ST/PHC/ మహిళలు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. CBT-1, CBT-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. CBT స్టేజ్ 1 పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.