‘She’ Wants Justice: ఇది జనాల భారతమా.. లేక అనాధ భారతమా?

ManaEnadu:అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాసపు అరాచకాన్ని.. స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా.. ఓ పవిత్ర భారతమా

అని సింధూరం సినిమాలో 19వ శతాబ్దంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ లిరిక్స్‌‌‌లో ఉన్న వాస్తవాలు 20వ శతాబ్దం వచ్చినా సమాజంలో మార్పు రావడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 78 వసంతాలు పూర్తయినా భారతమాత లాంటి స్త్రీలు నిత్యం ఏదో ఒక చోట మృగాళ్లాంటి మనుషుల మధ్య నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. ఢిల్లీ నిర్భయ ఘటన మరువక ముందే తాజాగా కోల్‌కతాలో అలాంటి సంఘటన ప్రస్తుతం దేశాన్నికుదిపేస్తోంది.

ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతో దేశం ఉలిక్కిపడుతోంది. ఓ వైపు ప్రపంచం ఆధునికతవైపు పరుగులు తీస్తుంటే మనం మాత్రం ఇలాంటి దిగజారుడు పనులతో ఆ ప్రపంచమే మనల్సి చూసి నవ్వుకునేలా ప్రవర్తిస్తున్నాం. స్వేచ్ఛాసంకేళ్లు తెంచుకున్న ఈ భారతావనిలో ఇంకెప్పుడు మాకు స్వేచ్ఛ లభిస్తుందని ‘‘ఆమె’’ ప్రశ్నిస్తోంది.. ఏం సమాధానం చెబుదాం.. చెప్పండి. చట్టంలో లొసుగుల పేరుతో తప్పు చేసిన వాడు దర్జాగా తిరుగుతోంటే అన్యంపుణ్యం తెలియని మన సోదరీమణులు తమ జీవితాలను ఇలా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తోంది.

ఇంకెన్ని రోజులు ఇలా..

మనకంటే చిన్నచిన్న దేశాలు తప్పు చేస్తే వెంటనే నిందితుడికి నడిరోడ్డులోనే శిక్షలు వేస్తుంటే..మనం మాత్రం చట్టం, న్యాయం, కోర్టులు, జైళ్లు అంటూ కాలయాపన చేస్తోంటే.. గాయపడిన మనసులకు, వారిని కనిపోషించిన తల్లిదండ్రులకు న్యాయం జరిగేది ఎప్పుడు? వారు సమాజంలో తలెత్తుకుని తిరిగేదెన్నడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేది ఎవరు? ఇప్పటికైనా మనలో మార్పు రాకపోతే రేపటి రోజు మన ఇంట్లో వారికే ఇలాంటి ఘటన ఎదురుకావచ్చొ. ఆలోచించండి. అన్యాయాన్ని అప్పడే ఎదురించండి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *