Kolkata Rape & Murder Case: నిరసనలు ఆపేదేలేదు.. వెనకడుగు వేసేదేలేదు!

ManaEnadu: కోల్‌కతా(Kolkata Horror)లో వైద్యురాలిపై జరిగిన హత్యాచార(Rape & Murder) ఘటనపై నిరసనలు( Protests) ఆగడం లేదు.

న్యాయం చేయాలంటూ డాక్టర్లు, వైద్య సిబ్బంది(Doctors, Nurses) తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆందోళనల చేస్తున్న డాక్టర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లోకి చేరాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు(Supreme Court) వారిని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, వైద్యులు తాము మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనే తగ్గేదే లేదు అని స్పష్టం చేస్తున్నారు. తమ తోటి వైద్యురాలికి అంతకష్టం వచ్చిందనీ, రేపటి రోజున తమకూ అలాంటి పరిస్థితులే ఎదురైతే ఎవరు తమను కాపడుతారని వైద్యులు అంటున్నారు. తమది నిరసన కాదని ప్రజా ఉద్యమమని, ప్రభుత్వంగానీ, ఉన్నత న్యాయస్థానం దీనిని అణచివేయలేవని వారు స్పష్టం చేశారు.

‘సుప్రీంకోర్టు విచారణ మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. కేసును హైకోర్టు(High Court) నుంచి సుప్రీంకోర్టుకు.. రాష్ట్ర పోలీసుల నుంచి CBIకి బదిలీ చేశారు.. కానీ, ఇప్పటి వరకూ న్యాయం మాత్రం జరగలేదు’ అని RG కర్ Hospital జూనియర్ డాక్టర్ల ప్రతినిధి వ్యాఖ్యానించారు. న్యాయస్థానానికి Bengal Govt తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. ఆరోగ్య వ్యవస్థ(Health Department) కుప్పకూలిందనే విషయం సరికాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడ్‌విట్‌లో వైద్యులు విధులకు దూరంగా ఉండటం వల్ల AUG 9 నుంచి 23 మంది రోగులు ప్రాణాలు(Deaths) కోల్పోయారని పేర్కొంది.

ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతు

మరోవైపు జూనియర్ వైద్యులు(Junior Doctors) ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్(Indian Medical Assossiation of Bengal) విభాగం ప్రకటించింది. ‘క్రూరమైన నేరాన్ని దృష్టిలో ఉంచుకుని మేము సానుకూల ఫలితాన్ని ఆశించాం. అయినప్పటికీ కోర్టు, CBI చర్యలతో పూర్తిగా నిరుత్సాహపడ్డాం. మా తోటి వైద్యురాలికి న్యాయం చేయడానికి త్వరిత విచారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది కూడా ఆసుపత్రుల్లో జరిగిన కొన్ని మరణాలకు జూనియర్ డాక్టర్లను బాధ్యులుగా చిత్రీకరించిన తీరు పూర్తిగా అవాస్తవం. జూనియర్ వైద్యుల కారణంగా ఆసుపత్రుల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయినట్టు చెప్పడం దిగ్భ్రాంతికరం’ అని జూడాలు మండిపడ్డారు. కాగా, సోమవారం నాటి విచారణ సందర్భంగా విధులను విస్మరించి నిరసనలు, ఆందోళనలు చేయడం సరికాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్(Jusitice DY Chandrachud), జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం హెచ్చరించిన విషయం తెలిసిందే.

Related Posts

Airstrikes: గాజాలో మళ్లీ కాల్పుల మోత.. 400 మందికిపైగా మృతి

కాల్పుల మోతతో గాజా(Gaza) మళ్లీ దద్దరిల్లింది. సీజ్‌ఫైర్ ఒప్పందం ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ సైన్యాలు వైమానిక(Israeli forces airstrikes) దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో అక్కడ దాదాపు 400కు పైగా జనం మృతి చెందినట్లు గాజా హెల్త్ డిపార్ట్ మెంట్(Gaza Health Department)…

రన్యారావు కేసులో తెలుగు హీరో అరెస్టు

బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వెనుక ఓ తెలుగు నటుడు కింగ్ పిన్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *