ManaEnadu:పశ్చిమ బెంగాల్ ((West Bengal)లోని కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో 31ఏళ్ల జూనియర్ డాక్టర్ హత్యాచారానికి ఘటన యావత్ దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆమె స్నేహితుడు తీవ్ర మానసిక వేదనకు లోనవ్వడంతో అతడి కుటుంబ సభ్యులు ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయట పడుతున్న ఆ వ్యక్తి డాక్టర్ మృతిపై న్యాయం కోసం ఆమె కుటుంబంతో కలిసి పోరాడుతున్నాడు. ఒకే బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ ఘటనకు నిరసగా ఆ ఆస్పత్రి వైద్యులు దాదాపు నెలరోజులుగా రోడ్లపైకి వచ్చి నిరసన (Kolkata Doctors Protests) తెలుపుతున్నారు. తన తోటి డాక్టర్‌పై జరిగిన ఈ అఘాయిత్యంపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banergee) చేసిన వ్యాఖ్యలపై మృతురాలి స్నేహితుడు తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చాడు. తనతో లైఫ్ షేర్ చేసుకుంటుదనుకున్న అమ్మాయి ఓ మృగాడి పైశాచానికి బలైపోవడం చూసి ఆ కుర్రాడి గుండె పగిలింది.
తన లైఫ్ పార్టనర్ అవుతుందనుకున్న అమ్మాయి చనిపోయిందని తెలుసుకున్న ఆ యువకుడు ఆమెతో కలిసి బతకాలని కన్న ఎన్నో కలలు ఒక్క రాత్రిలో కల్లలవ్వడం తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్‌పై ఆ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోల్‌కతా డాక్టర్ ఘటన(Kolkata Doctor Rape and Murder) జరిగి నెల రోజులు దాటిందని, ఇక ప్రజలు దాన్ని మరిచి దుర్గా పూజకు సిద్ధం కావాలని ఆమె కామెంట్స్ చేశారు.
మమతా బెనర్జీ కామెంట్స్‌ను నిరసిస్తూ మరణించిన డాక్టర్ స్నేహితుడు ఓ కవితను రాశాడు. తన స్నేహితురాలు మరణించి నెల దాటినా ఇంకా న్యాయం జరగకపోవడం చూసి తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి కవిత రూపంలో తన బాధను పంచుకుంటూ ఆమె మరణానికి న్యాయం జరగాలంటూ గళమెత్తాడు. ఆ యువకుడి ఆవేదనకు అక్షరరూపం ఇదే.
“ఆనాడు నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రోణాచార్యుడు మౌనంగా ఉండిపోయాడు. శక్తిస్వరూపిణి కొలువైన కోల్‌కతా నగరంలో ఓ దుర్గ (మరణించిన డాక్టర్‌ను ఉద్దేశిస్తూ) న్యాయం కోసం విలపిస్తోంది. ఓ న్యాయ దేవితా.. నీ కళ్లకు ఇంకా ఆ గంతలెందు న్యాయం కోసం కోల్‌కతా నగరం అర్థిస్తోంది. ఈ వేదన భరించలేమంటోంది. నా దుర్గ న్యాయం కోసం పరితపిస్తూ నన్ను అడుగుతుంటే నేను ఏ పండుగూ చేసుకోలేను.” అని అతడు తన ఆవేదనను పంచుకున్నాడు.