AE Rahul Betting Case : బెట్టింగ్‌కు బానిసగా మారిన మిషన్ భగీరథ ఏఈ..! రూ.15 కోట్ల అప్పు..!

Mana Enadu: మిషన్ భగీరథ(Mission Bhagiratha) పథకానికి అతను ఏఈగా వ్యవహరిస్తున్నాడు. కానీ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. దీంతో బెట్టింగ్‌లకు పాల్పడి దాదాపు 15 కోట్ల రూపాయల వరకు అప్పులపాలయ్యాడు.

మిషన్ భగీరథ(Mission Bhagiratha) పథకానికి అతను ఏఈగా వ్యవహరిస్తున్నాడు. కానీ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. దీంతో బెట్టింగ్‌లకు పాల్పడి దాదాపు 15 కోట్ల రూపాయల వరకు అప్పులపాలయ్యాడు.

కీసర(Kesara) మండలం మిషన్ భగీరథ ఏఈగా(AE) పనిచేసున్న రాహుల్‌(Rahul) ఆన్‌లైన్‌ గేమ్స్ రమ్మీ, ఇతర గేమ్స్‌కు బానిసయ్యాడు. దాదాపు 15 కోట్ల వరకు అప్పులు చేశాడు. అప్పులు తిరిగిఇవ్వాలని బాధితులు కోరగా భగీరథ పనులను ఇప్పిస్తానని కాంట్రాక్టర్ల నుంచి 15 కోట్లు వసూలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆరు నెలల కిందట రాహుల్‌ను సస్పెండ్ చేశారు. రాహుల్‌కు సహకరించిన మరో అధికారిని కూడా సస్పెండ్ చేశాడు. ఈ వ్యవహారంపై కీసర పోలీస్‌స్టేషన్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే కొంత కాలంగా పరారీలో ఉన్న రాహుల్‌ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. లుకౌట్‌ నోటీసులు ఉండడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దొరికిపోయాడు. రాహుల్‌ను కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. రాహుల్‌ తల్లిదండ్రులు, భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉన్నారు. బాధితులకు డబ్బు తిరిగిస్తామని వారు హామీ ఇచ్చి నెరవేర్చలేదని బాధితులు వాపోయారు.

Share post:

లేటెస్ట్