‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ రిలీజ్.. ఏడిపించేశారు భయ్యా

ManaEnadu:సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బావగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. తొలి సినిమాతోనే తనలోని నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ నటుడు నవదళపతిగా టాలీవుడ్‌లో తన సత్తా చాటుతున్నాడు. రొటీన్‌కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ నయా పంథాలో తన సినీ ప్రయాణం సాగిస్తున్నాడు. తాజాగా సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్‌ హీరో (maa nanna super hero)’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను నేచురల్ స్టార్ నాని (Nani) రిలీజ్ చేశాడు. ఈ టీజర్‌లో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. సుధీర్ బాబు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని చాలా హృద్యంగా చూపించారు. అమ్మను అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్టు కాదు.. నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదని సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

టీజర్‌లో షాయాజీ (Sayaji Shinde) షిండే తండ్రి పాత్రలో కనిపించగా, తండ్రితో విభేదాలున్న కుమారుడి పాత్రలో సుధీర్ బాబు (Sudheer Babu) ఆకట్టుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం పాత్ర కూడా టీజర్ ద్వారా పరిచయమవుతుంది. సాయి చంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, ఆనీ ముఖ్య పాత్రలు పోషించారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, తండ్రీ కొడుకుల మధ్య అనుబంధమే ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కనకరా దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బాలుసు, సిఎఎం ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఇక హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘మా నాన్న సూపర్‌ హీరో’ (maa nanna super hero teaser) టీజర్ లాంచ్‌ ఈవెంట్‌లో సుధీర్‌ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పినప్పుడు తన తండ్రి నాగేశ్వరరావు గుండె ముక్కలైందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన ఇండియాలోనే పెద్ద డిస్ట్రిబ్యూటర్‌ అని తెలిపారు. అదృష్టవశాత్తూ ఇండస్ట్రీలో ఓ స్థానం దక్కించుకోగలిగా. అందుకు నాన్న హ్యాపీ’’ అని చెప్పుకొచ్చారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *