ManaEnadu:బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 (Bigg Boss 8) రెండో వారం చివరకు వచ్చేస్తోంది. అప్పుడే పది రోజులు ముగిసిపోయాయి. రెండో వారం మొదటి రోజు నుంచి ఆట ఫుల్ మజాగా సాగుతోంది. హౌజులో గొడవలు, అరుపులు, ఏడుపులు, గగ్గోలతోపాటు కంటెస్టెంట్లు మస్తీ చేసుకుంటున్నారు. ఇటు బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు కంప్లీట్ చేస్తూనే అటు మజా చేసుకుంటున్నారు.
అయితే ఈ సీజన్ మొదట్లో కంటెస్టెంట్లను చూసి ఈ సీజన్‌కు పెద్దగా ఆదరణ దక్కదని అంతా భావించారు. కానీ ఫస్ట్ వీక్ వ్యూయర్ షిప్ ఈ అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. బిగ్‌బాస్ రియాల్టీ షో హిస్టరీలోనే రారాజుగా ఈ సీజన్ నిలిచింది. ఇటు రేటింగ్స్ (Ratings)లో అటు వ్యూయర్ షిప్‌లో సత్తా చాటింది. ఏకంగా 5.9 బిలియన్స్ మినిట్స్ వ్యూయర్ షిప్‌ను దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సీజన్. అంతే కాకుండా 18.9 రేటింగ్‌తో రారాజుగా నిలిచింది.
తాజాగా ఈ విషయాన్ని ఈ సీజన్‌కు హోస్టుగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ప్రకటించారు. “5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ బ్రేకింగ్ వీక్షణ (Viewership)తో ఎంటర్‌టైన్మెంట్ కా బాప్‌గా BIGGBOSSTELUGU8 నిలిచింది. వ్యూయర్ షిప్, రేటింగ్ రికార్డులను తాజా సీజన్ బద్దలు కొట్టి అద్భుతమైన కొత్త శిఖరాలకు చేరుకుంది. మాపై ఇంతటి ప్రేమను చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు మేం రెడీగా ఉన్నాం.”అంటూ ఎక్స్ వేదికగా నాగార్జున (Nagarjuna) పోస్టు పెట్టారు.
https://twitter.com/iamnagarjuna/status/1834212018926301478
మరోవైపు ఇవాళ్టి ప్రోమో (Bigg Boss Promo Lates) చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రైజ్ మనీని పెంచుకోవడానికి హౌజ్‌లో ఉన్న వాళ్లకు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. డబ్బులు గెలుచుకునేందుకు బజర్ మోగినప్పుడు నాగ మణికంఠ, సోనియా, విష్ణు ప్రియలు స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని టాస్క్ ఇవ్వడంతో మొదటగా వెళ్లిన సోనియా కిందపడిపోయింది. విష్ణు ప్రియ, మణికంఠలు స్విమ్మింగ్ పూల్‌లో దూకి టాస్క్ కంప్లీట్ చేశారు. ఆ తరువాత.. కలర్ బాల్ టాస్క్‌లో పృథ్వీ, నిఖిల్, నబీల్‌లు పోటీ పడగా నబీల్ ముందుగానే వదిలేశాడు. ఇక ఆట పృథ్వీ వర్సెస్ నిఖిల్ మధ్య హోరా హోరీగా నడిచింది. ఇందులో ఎవరు గెలిచారో తెలియాలంటే ఇవాళ్డి ఎపిసోడ్ చూడాల్సిందే.