‘అప్పటి వరకు అలా చేయొద్దు’.. నిర్మాతలకు మహేశ్ బాబు రిక్వెస్ట్

ManaEnadu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న మూవీ‘#SSMB29. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అప్డేట్స్ కోసం ఎంతో ఆశగా చూస్తున్న బాబు ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

ప్రతి పండుగకు, పుట్టినరోజుకు అప్డేట్స్ వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే మిగులుతోంది. అయితే తాజాగా మహేశ్ బాబుకు సంబంధించి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. నిర్మాతల హీరోగా చెప్పుకునే ఈ సూపర్ స్టార్ తాజాగా తను నటించిన సినిమా నిర్మాతలకు ఓ అల్టిమేటమ్ జారీ చేశాడట. ఇంతకీ అదేంటంటే?

ఇప్పటి వరకు కేవలం తెలుగు ప్రేక్షకులను అలరించిన మహేశ్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్‌తో పాన్‌ వరల్డ్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్‌లోనూ మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నాడు. ఈ చిత్రంతోనే హిందీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. అయితే ‘#SSMB29తోనే తన నటన హిందీ ప్రేక్షకులకు చేరువ కావాలని మహేశ్ బలంగా అనుకుంటున్నాడట.

అందుకే ఈ చిత్రం’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీ (Mahesh Babu Hindi Movies)లోకి డబ్‌ చేసి థియేటర్‌లలో రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు సమాచారం. ఇప్పటి వరకు మహేశ్‌ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదన్న విషయం తెలిసిందే. SSMB29 మూవీయే బాలీవుడ్‌లో తన ఫస్ట్ ఫిల్మ్ కాబోతోంది. అందుకే అక్కడి ప్రేక్షకులను అలరించేందుకు బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్.

ఇక అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే పొడవాటి జుట్టుతో ఉన్న లుక్ బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Share post:

లేటెస్ట్