‘మత్తు వదలరా2’కు వెళ్తున్నారా?.. ఐతే పార్ట్-1 రీక్యాప్ చూసేయండి

ManaEnadu:ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). మరో కీలక పాత్రలో సత్య నటించిన ఈ చిత్రాన్ని రితేశ్‌ రానా తెరకెక్కించాడు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌ (Promotions) ముమ్మరం చేసింది. వెరైటీగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే మత్తు వదలరా 2 టీమ్​ ప్రచారం కోసం దర్శకుధీరుడు రాజమౌళిని కలిసిన టీమ్ ఇప్పుడు మరో విధంగా ప్రమోట్ చేసింది. మత్తువదలరా చిత్రానికి ఈ మూవీ సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్ట్-1కు సంబంధించి కథను మరోసారి ప్రేక్షకులకు చెప్పారు హీరో శ్రీసింహా (Sri Simha), నటుడు సత్య.
అయితే సాధారణంగా సినిమా కథను చెప్పకుండా టీవీల్లో ప్రసారమయ్యే క్రైమ్ స్టోరీ (Crime Atory) తరహాలో పార్ట్-1 కథను చెప్పారు. కథ చెప్పేటప్పుడు మధ్యమధ్యలో హ్యూమర్ యాడ్ చేశారు. ఇక చివరలో ఇంకా మొత్తం కథ చెప్పడం మా వల్ల కాదండోయ్, అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)లో మత్తువదలరా పార్ట్-1 స్ట్రీమింగ్ అవుతోంది చూడండి అంటూ గుడ్ బై చెప్పారు. అలాగే సెప్టెంబరు 13వ తేదీన తప్పకుండా థియేటర్‌లకు వచ్చి తమ సినిమాను చూడాలని కోరారు.

ఇప్పుడు ఈ వీడియో (Mathu Vadalara Part 1 Recap) నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రమోషన్స్‌ చాలా క్రేజీగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 3 గంటల సినిమాను 3 నిమిషాల్లో భలే చెప్పారు భయ్యా అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు. ఇక ‘మత్తు వదలరా 2’ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్, రోహిణి, సునీల్​ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

Share post:

లేటెస్ట్