వరద బాధతులకు అండగా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్

ManaEnadu:భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు(Telugu Television Producers Association). తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

నటుడు, నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ – తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వరదల కారణంగా సర్వస్వం కోల్పోయారన్నారు.వరద బాధితులను ఆదుకునేందుకు మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు.మా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావుతో మాట్లాడి సీరియల్స్ నిర్మించే ప్రతి ప్రొడ్యూసర్ తమకు చేతనైనంత విరాళం ఇవ్వాలని కోరాం అన్నారు.
శ్రీరామ్ మాట్లాడుతూ – వరదలతో మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కు సందేశం ఇవ్వగానే స్పందించారని తెలిపారు.

తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సెక్రటరీ వినోద్ బాల మాట్లాడుతూ – అసోసియేషన్ లోని సభ్యులంతా స్పందించి ముందుకొచ్చారన్నారు. తమ వంతు విరాళం అందించినందుకు సంతోషంగా ఉందన్నారు.

తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు మాట్లాడుతూ 260 మంది ప్రొడ్యూసర్స్ లో 60 మందే ఇప్పుడు యాక్టివ్ గా సీరియల్స్ చేస్తున్నారన్నారు.రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు సాయం చేయబోతున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తామన్నారు.
15 వేల మంది కార్మికులు టీవీ రంగంలో జీవనోపాధి పొందుతున్నారు. వారికి కరోనా టైమ్ లో రెండేళ్లు మా ప్రొడ్యూసర్స్ అంతా కలిసి అండగా నిలబడ్డాం. ఈ వరదల్లో కొందరు రాజకీయ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారు. అలాంటివి మానుకోవాలని కోరుతున్నాం. అన్నారు.

Share post:

లేటెస్ట్