ManaEnadu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli)తో కలిసి ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 పేరుతో తెరకక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబో అనౌన్స్‌మెంట్ తప్ప ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఒక్క అప్డేట్ రాలేదు. మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమమాచారం.
మహేశ్ బాబు (Mahesh Babu)-రాజమౌళి సినిమాకు దాదాపుగా రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. జక్కన్నతో పని చేసేటప్పుడు వేరే సినిమాలకు కమిట్ అవ్వడం కుదరదు. అంటే వేరే దర్శకులు మహేశ్ బాబుతో పని చేయాలంటే దాదాపు ఓ మూడేళ్ల వరకు వేచి చూడాల్సిందే. అయినా సరే మహేశ్ బాబు కోసం ముగ్గురు బడా డైరెక్టర్లు (Directors) క్యూలో ఉన్నారు. SSMB29 తర్వాత మహేశ్ డేట్స్ కోసం లైన్ కట్టారు. మరి ఆ దర్శకులు ఎవరంటే?
సందీప్ రెడ్డి వంగాతో మహేశ్
మహేశ్ బాబుతో యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ సినిమా చేయనున్నట్లు అప్పట్లో టాక్ నడుస్తోంది. SSMB30 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తీసే ఛాన్స్ ఉండొచ్చని టాక్. ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మించనుందట. ఇక ఆ తర్వాత SSMB 31 కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మహేశ్‌తో వర్క్ చేయనున్నారట. ఈ ఇద్దరి కాంబోలో ఇటీవల వచ్చిన గుంటూరు కారం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
కొరటాలకు మరో ఛాన్స్
మరోవైపు శ్రీమంతుడు, భరత్ అనే నేను (Bharat Ane Nenu) సినిమాలతో మహేశ్ కెరీర్‌లో ది బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఈ సూపర్ స్టార్‌తో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడట. SSMB32 మూవీని కొరటాల (Koratala Shiva)తో చేయడానికి మహేశ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాడట. వీరి కాంబో సెట్ అయితే ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందట.
సక్సెస్ అయితేనే వాళ్లకు ఛాన్స్
సందీప్ రెడ్డి వంగాతో సినిమా ప్లానింగ్ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. దీనికోసం సరైన కథ కోసం ఇద్దరూ ఎదురుచూస్తున్నారట. మరోవైపు ఆచార్యతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూటగట్టుకున్నారు కొరటాల శివ. ఎన్టీఆర్‌తో తీస్తున్న దేవరపైనే ఆయన అశలన్నీ ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగాతో సినిమా దాదాపుగా కన్ఫామ్ చేసిన మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలతో చేయాలంటే మాత్రం వారి నెక్స్ట్ చిత్రాలు సక్సెస్ అయితేనే సాధ్యమని చెప్పొచ్చు.