ALLU ARJUN VS MEGA FAMILY: మెగా కాంపౌండ్‌తో ఢీ.. ఆమే కారణమా?

ManaEnadu:టాలీవుడ్‌(TOLLYWOOD)కు ఫ్యాన్స్ వార్ కొత్తేమీ కాదు. కానీ హీరోలే ఇండైరెక్ట్‌గా ఫైట్‌కి దిగడం మునుపెన్నడూ లేదు. అది కూడా మెగా కాంపౌండ్‌లోనే హీరోగా ఓ హీరో సెపరేట్‌ సామ్రాజ్యం స్థాపించేందుకు చూస్తున్నారా? ఇంతకీ దానికి ఆజ్యం పోసిందెవరు? అందరికీ కనిపిస్తున్నట్లుగా మెగా ఫ్యామిలీ అంటే కేవలం ఈర్శ్య ఒక్కటే కారణమా? లేక దాని వెనుక ‘ఆమె’ ఉందా? ఇంతకీ ఎవరామె? ఆమె కోసమే ఆ హీరో మామ ఫ్యామిలీతో కయ్యానికి సిద్ధమవుతున్నారా? ఓ లుక్కేద్దాం.

సెపరేట్ ఫ్యాన్‌బేస్.. ప్రవర్తనలో మార్పు
అల్లు అర్జున్(ALLU ARJUN).. హీరోగా ‘గంగోత్రి’తో ఎంట్రీ ఇచ్చినప్పుడు కేవలం మెగాస్టార్ చిరంజీవి(CHIRANJEEVI) అల్లుడనే కారణంతోనే బాక్సాఫీస్‌లో టికెట్లు చిరిగాయనడంలో సందేహం లేదు. ఆ విషయాన్ని బన్నినే స్వయంగా చెప్పాడు. అయితే ఎంట్రీ అయితే మెగా మామ అల్లుడిగా ఇచ్చాడు కానీ ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ సెలక్షన్, డ్యాన్స్, ఫైట్లు, యాక్టింగ్ ఇలా అన్నింట్లోనూ వెరైటీ మార్క్ చూపించాడు. ముఖ్యంగా ఆర్య, దేశముదురు, ఆర్య2, జులాయి,సరైనోడు, అల వైకుంఠపురములో లేటెస్టుగా పుష్ప.. ఇలా హిట్టు మీద హిట్టు కొడుతూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. టాలీవుడ్‌లోనే(TOLLYWOOD) టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఇదే క్రమంలో బన్ని ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. ఇక్కడే మెగా కాంపౌండ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు.

చెప్పను బ్రదర్ అంటూ మొదలెట్టి..
2016లో సరైనోడు(SARINODU) సక్సెస్‌మీట్‌లో వేదికపై మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) గురించి మాట్లాడాలని మెగా ఫ్యాన్స్ కేకలు వేశారు. దానికి బన్ని రియాక్ట్ అవుతూ ‘చెప్పను బ్రదర్’ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌ను కాస్త హర్ట్ చేశాయి. అక్కడి నుంచి అల్లు అర్జున్ ప్రవర్తనలో కాస్త మార్పు కనిపిస్తూ వచ్చింది. మరో వేదికపై మాట్లాడుతూ ‘అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది’ అన్నాడు. ఇదే బన్నీ గతంలో ‘మెగా ఫ్యాన్స్ వల్లే నేను ఇండస్ట్రీలో హీరోనయ్యాను’ అని చెప్పడం గమనార్హం. అయితే ఈ రెండు కామెంట్స్ ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉండటంతో బన్ని మెగా కాంపౌండ్‌లో హీరో కాదని, ఆయన సెపరేట్‌గా కాంపౌండ్ నిర్మించేందుకు రెడీ అయ్యాడని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.

‘నచ్చితే ఎక్కడికైనా వస్తా’..
ఇవన్నీ ఒకెత్తయితే ఆంధ్రప్రదేశ్(ANDHRAPRADESH) ఎన్నికల్లో వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డికి(Shilpa Ravi Chandra Reddy) బన్ని మద్దతుగా ప్రచారం చేశారు. అది కాంట్రవర్సీ అయ్యింది. అయితే మరోవైపు వైసీపీని(YCP) తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తన మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మద్దతివ్వకపోగా జనసేనానిని ఎదురుగా అడుగులు వేయడం మెగా ఫ్యామిలీని ఉద్దేశపూర్వకంగా బన్ని టార్గెట్ చేశారనే సందేహాలు కలిగాయి. పవన్ కళ్యాణ్‌కు కేవలం ట్వీట్‌తో సరిపెట్టి శిల్పా రవింద్రారెడ్డికి మాత్రం ఇంటికి వెళ్లి మరీ సపోర్ట్ ఇచ్చాడు. ఐకానిక్ స్టార్ ప్రచారం చేసిన శిల్పా ఓడిపోయారు అది వేరే విషయం. అయితే పవన్ కళ్యాణ్‌కు కాకుండా శిల్పాకు ఎందుకు మద్దతిచ్చారు? అని తనకు ఎదురైన ప్రశ్నలకు ‘నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా’ అని కాస్త కటువుగానే బదులిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ నచ్చలేదా? అనే సందేహాలూ వచ్చాయి. జనసేన(JANASENA) 100 స్ట్రైక్‌రేట్‌తో గెలిచిన తర్వాత కూడా బన్నీ పెట్టాలి కదా అన్నట్లుగా ఓ ‘కంగ్రాట్స్’ ట్వీట్ చేశారు. చిరు, పవన్ బర్త్ డేల సందర్భంగానూ వెరీ నార్మల్ విష్ చేశారు. అందులో ప్రేమ, ఆప్యాయతలు కనిపించనే లేదు. ఏదో బయటి వ్యక్తి ట్వీట్స్‌లా ఉన్నాయి.

భార్య కోసమేనా ఇదంతా?
నిజానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ కానేకాదు. బన్నీ వైఫ్ స్నేహారెడ్డి(SNEHA REDDY), శిల్పా వైఫ్ నాగినీ రెడ్డి ఫ్రెండ్స్. వారిద్దరూ క్లాస్ మేట్స్. ఫ్రెండ్స్. అయితే భార్య స్నేహారెడ్డి డైరెక్షన్‌ వల్లే పవన్ స్టార్‌కు ఎదురెళ్లాల్సి వచ్చిందనేది ఓ టాక్. అల్లు అర్జున్ స్థానంలో మరో మెగా హీరో ఉంటే ఇలా చేసి ఉండేవాడు కాదేమో. నిజానికి పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాటను ఏనాడూ జవదాటింది లేదు. అల్లు స్నేహారెడ్డి మెగా ఫ్యామిలీతో పెద్దగా కలిసిన సందర్భాలు కూడా తక్కువే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన బర్త్ డే సందర్భంగానూ ఆమె విష్ చేయలేదు. తారక్ వైఫ్ ప్రణతి, మహేశ్ బాబు భార్య నమ్రత పోస్టులు చేసినా బన్నీ సైతం స్పందించకపోవడం గమనార్హం. తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేయడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా సెన్సేషనల్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీతో నటించవద్దని ఆమె బన్నీకి కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బన్ని కూడా ఆమెతో నటించేందుకు నో చెప్పాడట. అయితే మెగా గొడుగు కింద నుంచి బయటికి వచ్చేలా అల్లు అర్జున్‌ను ప్రోత్సహించేది భార్యపై ప్రేమ, అభిమానం, గౌరవం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్ ఎలా ఎండ్ అవుతుందో.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్లి పుష్ప ‘ఫ్లవర్’ అవుతాడా? లేక ‘ఫైర్’ అవుతాడా చూడాలి.

Share post:

లేటెస్ట్