ManaEnadu:హనుమాన్ (HanuMan) సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో పలు ప్రాజెక్టులు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఆయన సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ (Prasanth Varma).. హనుమాన్ సీక్వెల్ జైహనుమాన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జై హనుమాన్’ విడుదల తేదీ, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి చాలా వివరాలు షేర్ చేసుకున్నాడు వర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జై హనుమాన్’ (Jai Hanuman) పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాడు. ‘హనుమాన్’ మూవీకి వచ్చిన రెస్పాన్స్‌తో బాధ్యత పెరిగిందని అందుకే జైహనుమాన్ను అంతకుమించి అద్భుతంగా తీర్చి దిద్దుతున్నట్లు తెలిపాడు.
‘‘”జై హనుమాన్’ కోసం చాలా మంది కష్టపడుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నటీనటుల ఎంపిక కూడా పూర్తయింది. ‘హనుమాన్’ సమయంలో మొదట షూటింగ్ చేసి తర్వాత వీఎఫ్‌ఎక్స్ పనులు చేశాం. దానివల్ల సినిమా అనుకున్న సమయం కంటే కాస్త లేటయింది. జైహనుమాన్ విషయంలో అలా జరగకుండా చూసుకుంటున్నాం. సీక్వెల్‌కు మాత్రం వీఎఫ్‌ఎక్స్ పనులు ముందే సిద్ధం చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టదు. జైహనుమాన్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తాం” అంటూ తన లేటెస్ట్ మూవీ ముచ్చట్లు షేర్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ.
ఇక ‘ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ (Prashant Varma Cinematic Universe) యూనివర్స్ కోసం తాను కొందరు బాలీవుడ్ స్టార్స్‌ను కలిశానని చెప్పుకొచ్చాడూ ఈ యంగ్ డైరెక్టర్. ఇక‘‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీరా’ (Adhira)వస్తుందని తెలిపాడు. ప్రతి సంవత్సరం కనీసం ఒకటి, రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించాడు. మరోవైపు ప్రశాంత్ వర్మ లైనప్‌లో తాజాగా మోక్షజ్ఞ (Mokshagna) సినిమా చేరిన సంగతి తెలిసిందే.