Akhanda 2 : బాలయ్యతో ఫారిన్ విలన్ ఫైట్.. బోయపాటి స్కెచ్ అదుర్స్

ManaEnadu:నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో తిరుగులేదు. ఈ కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. బాలయ్య కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ సూపర్ హిట్స్. ఈ మూడు సినిమాలకు ఇటు బాలయ్యకు క్రేజు అటు నిర్మాతలకు కాసులు కురిపించాయి. బాలయ్య-బోయపాటి కాంబో అంటే హిట్టు గ్యారెంటీ అని ఫ్యాన్స్ నమ్మే స్థాయికి వచ్చారు.

అఖండ-2 షూటింగ్..

అఖండ (Akhanda) సూపర్ హిట్ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని ఈ ధ్వయం భావించింది. ఈ నేపథ్యంలో తాజాగా అఖండ-2కు సంబంధించి ఓవార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ కోసం బోయపాటి శ్రీను వేట షురూ చేశారట.

బాలయ్యను ఢీకొట్టే విలన్

బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో చాలా పవర్‌ఫుల్ పాత్ర ఉండాల్సిందే. అందుకే ఓ పవర్ ఫుల్ విలన్‌ను వెతుకుతున్నారట బోయపాటి (Boyapati Srinu). అందుకోసం ఇండియాలో కాకుండా ఏకంగా ఫారిన్ విలన్ కోసం ట్రై చేస్తున్నారట. అఖండ-2లో విలన్‌ గా చైనీస్ (Chinese) లేదా కొరియన్ నటులను చూస్తున్నారట. అంతే కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఓ పర్సనాలిటీని కూడా పరిశీలిస్తున్నారట. ఇందుకు సంబంధించి అఖండ-2 టీమ్ ఆడిషన్ కాల్ కూడా ఇచ్చిందట.

అఖండ-2 ఆడిషన్ కాల్

అఖండ-2 (Akhanda-2)లో విలన్ క్యారెక్టర్‌కు 50-55 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉండి, నటనలో నైపుణ్యం ఉన్న వ్యక్తి కోసం మేకర్స్ వెతుకుతున్నారట. అలాటే 16 నుంచి 18 ఏళ్ల వయసున్న ఓ భారతీయ అమ్మాయిని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేయాలనుకుంటున్నారట. ఆ పాత్రకు కూడా ఆడిషన్స్ ఆహ్వానించారు. ఈ ఆహ్వనాలు చూసిన అభిమానులు అఖండ-2 కోసం బోయపాటి పెద్ద స్కెచ్ వేస్తున్నట్టున్నారని అంటున్నారు.

 

 

 

Share post:

లేటెస్ట్